Sun Pharma Plant: ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మారంగంలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. అతిపెద్ద ఫార్మాస్యూటికల్ సంస్థ సన్ ఫార్మా త్వరలో రాష్ట్రంలో ప్లాంట్ నెలకొల్పనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఆ సంస్థ ఎండీ సంప్రదింపులు జరిపారు.
ప్రముఖ ఫార్మా స్యూటికల్ సంస్థ సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగ ప్రగతి, సన్ ఫార్మా యూనిట్ స్థాపన వంటి కీలకాంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. త్వరలో ఏపీలో సన్ ఫార్మా ప్లాంట్ స్థాపిస్తామని ఆ సంస్థ ఎండీ దిలీప్ సాంఘ్వీ వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ ఎండ్ టు ఎండ్ ప్లాంట్‌గా తీసుకొస్తామని..ఎగుమతులే లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయన్నాయని సన్ ఫార్మా తెలిపింది. పారిశ్రామికాభివృద్ధి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) చర్యలు తీసుకుంటున్నారని దిలీప్ సాంఘ్వీ వివరించారు. సన్ ఫార్మా పరిశ్రమను త్వరలో నెలకొల్పి..తయారీ సామర్ధ్యాన్ని పెంచుకుంటామన్నారు. పరిశ్రమల స్థాపనకు కావల్సిన పూర్తి సహకారాన్ని ముఖ్యమంత్రి అందిస్తామన్నారని దిలీప్ సాంఘ్వీ చెప్పారు. ఏపీ నుంచి ఔషధాల్ని ఎగుమతి చేయాలనేది తమ లక్ష్యమని సన్ ఫార్మా (Sun Pharma)ఎండీ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తమ ఆలోచనల్ని షేర్ చేసుకున్నామని..పరిస్థితి సానుకూలంగా ఉందని తెలిపారు.
మరోవైపు ఏపీలో పారిశ్రామిక ప్రగతికై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని జగన్ కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత అనువైన పారదర్శక విధానాలు అందుబాటులో ఉన్నాయని..నైపుణ్యాభివృద్ధిని పెంచడం ద్వారా క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ అందుబాటులో వస్తాయని వైఎస్ జగన్ చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వివరించారు.
Also read: Ashok Gajapati Raju: అశోక గజపతిరాజుకు ఆ కారు టెన్షన్.. పూర్తిగా పక్కన పెట్టేశారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook