Supreme Court: వివేకా హత్య కేసు దర్యాప్తు నుంచి రాంసింగ్ తొలగింపు, 6 మందితో సిట్ ఏర్పాటు

Supreme Court: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సరిగ్గా నెలరోజుల్లో విచారణ ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చిన సీబీఐకు ఈ పరిణామం ఒక షాక్‌గా చెప్పవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 29, 2023, 05:29 PM IST
Supreme Court: వివేకా హత్య కేసు దర్యాప్తు నుంచి రాంసింగ్ తొలగింపు, 6 మందితో సిట్ ఏర్పాటు

Supreme Court: ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణమం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను సుప్రీంకోర్టు తొలగించింది. అంతేకాకుండా నెలరోజుల్లోగా కేసు విచారణ ముగించాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను మార్చాలంటూ ఈ కేసులో నిందితుడైన శంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటీషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఎన్నాళ్లు తీసుకుంటారని ప్రశ్నించింది. కేసు షీట్ మొత్తం ఎక్కడ చూసినా రాజకీయ కోణాలనే రాసుకొచ్చారని, ఈ ఆధారాలు సరిపోవని వ్యాఖ్యానించింది. 

స్టేటస్ రిపోర్ట్ ‌ ఏ విధమైన పురోగతి లేదని..అన్నిచోట్లా రాజకీయ వైరం అని రాస్తే దోషుల్ని పట్టుకునేందుకు ఆ కారణాలు ఎలా సరిపోతాయని ప్రశ్నించింది. సీబీఐ అధికారి తీరు చూస్తుంటే కేసు ఇప్పట్లో ముగించేలా లేనట్టు కన్పిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు అధికారిని మార్చాలని లేదా అతనికి తోడుగా మరొకరిని నియమించాలని వెల్లడించిన కోర్టు కేసు విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది.

ఇవాళ జరిగిన విచారణలో సుప్రీంకోర్టు సీబీఐకు ఊహించని షాక్ ఇచ్చింది. ముందు రాంసింగ్‌ను కొనసాగిస్తూనే మరో అధికారి పేరుని సీబీఐ సూచించగా, కేసు దర్యాప్తులో పురోగతి లేనప్పుడు రాంసింగ్‌ను కొనసాగించడంలో అర్ధం లేదని చెబుతూ అతనిని తొలగించేసింది. కొత్తగా ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. సీబీఐ డీఐజీ చౌరాసియా నేతృత్వాన ఏర్పాటైన సిట్‌లో సభ్యులుగా ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముకేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు ఎస్ శ్రీమతి, పునియా, ఎస్ఐ అంకిత్ యాదవ్‌లను సుప్రీంకోర్టు నియమించింది.

ఏప్రిల్ 30లోగా సిట్ విచారణ పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఆరు నెలల్లో ట్రయల్ ప్రారంభిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. లేనిపక్షంలో నిందితులు రెగ్యులర్ బెయిల్‌కు అప్పీల్ చేసుకోవచ్చని వెల్లడించింది. 

Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై తుది విచారణ జూలై 11న, తేల్చిన సుప్రీంకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News