యువ ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ సరికొత్త ఎత్తుగడ !!

ఎన్నికల్లో వైసీపీని దెబ్బకొట్టేందుకు టీడీపీ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది.

Last Updated : Apr 2, 2019, 10:54 AM IST
యువ ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ సరికొత్త ఎత్తుగడ !!

ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షిందుకు రాజకీయ పార్టీల చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలో యువ ఓటర్లే లక్ష్యంగా టీడీపీ అడుగులు  వేస్తుంది.  'యువనేస్తం' పథకం ద్వారా నిరుద్యోగ భృతి అందిస్తున్న చంద్రబాబు.. ఈ పథకానికి మరింత మెరుగులు దిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. యువనేస్తం పథకం ద్వారా ఇప్పటి వరకు అందిస్తున్న రూ.2 వేల నిరుద్యోగ భృతిని రూ.3 వేలకు పెంచేందుకు టీడీపీ సిద్ధమైంది. ఈ మేరకు తన మేనిఫెస్టోలో హామీని పొందుపరుస్తోంది.

యువనేస్తం వయోపరిమతి తగ్గింపు..

నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేయాలంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం కనీసం 23 ఏళ్ల వయసుండాలి. వయోపరిమితి నిబంధనలు సడలించేందుకు టీడీపీ సిద్ధమైంది. వయోపరిమితి మరింత తగ్గించి.. 18 ఏళ్ల వారికి ఈ పథకం వర్తించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌తోనే చదువు ఆపేస్తున్న వారికి యువనేస్తం పథకం వర్తింపజేసేలా తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది .  

ఏటా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు...
యువతకు ఉద్యోగాల కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలోనే రాష్ట్రంలో కూడా ఏపీపీఎస్సీ ద్వారా ఏటా నియామకాల నోటిఫికేషన్లు ఇస్తామని, నియామకాల కేలండర్‌ను విడుదల చేసేందుకు ప్రయాణిక సిద్దం చేసుకుంది. ఈ మేరకు టీడీపీ తన మేనిఫెస్టోలో హామీని పొందుపరుస్తోంది.

 

Trending News