TDP Janasena Alliance: ఏపీలో రోజురోజుకు ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. సామాజిక లెక్కలతో అభ్యర్థులను మారుస్తున్నారు సీఎం జగన్. సర్వేలు చేయించి బలహీనంగా ఉన్న చోట్ల సిట్టింగ్‌లను పక్కనపెడుతున్నారు. మొత్తం 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంతో గెలుపు గుర్రాలను బరిలో దింపే పనిలో ఉన్నారు. అయితే జగన్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయబోమంటూ పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇదే వ్యూహంతో టీడీపీతో జత కలిశారు. జనసేనకు మిత్రపక్షమైన బీజేపీని పొత్తులో చేర్చేందుకు శతవిధాలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీడీపీ కూటమిలో చేరాలా ? జనసేనను వదులుకోవాలా అన్న డైలమాలో బీజేపీ కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయంలో కమలం పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. కమలనాథులు కలిసి వచ్చినా.. రాకున్నా.. తాను మాత్రం టీడీపీ వెంటే నడుస్తానంటూ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేశారు.
అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణను రెడీ చేస్తున్నాయి. తాజాగా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనకు పొత్తులో భాగంగా 27 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని సమాచారం. అనకాపల్లి, మచిలీపట్నం లోక్ సభ స్థానాలు జనసేనకు కేటాయించటం దాదాపు ఖాయమైందంటున్నారు. అయితే రాజంపేట సీటుపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అసెంబ్లీ స్థానాలపై టీడీపీ-జనసేన ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 స్థానాలు ఉండగా... పొత్తులో భాగంగా జనసేనకు 27 అసెంబ్లీ స్థానాలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ సైతం పొత్తుకు సిద్ధమైతే.. ఎన్ని స్థానాలు కేటాయించాలన్న అంశంపైనా టీడీపీ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీతో పొత్తును టీడీపీలో కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జత కడితే ముందు ముందు ప్రయోజనకరమని మరికొందరి వాదన. అటు బీజేపీలోనూ టీడీపీతో పొత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికి వారు లెక్కలు కట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
మరోవైపు జనసేనకు కేటాయించే స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేశారని సమాచారం. పవన్ కల్యాణ్ భీమవరం నుంచి మరోసారి పోటీ చేయటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతిలోనూ పవన్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతున్నా.. ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో సీనియర్లకు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది. వైసీపీ చేస్తున్న మార్పులు, చేర్పుల తరువాత అవసరమైతే అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: MP Bandi Sanjay: ఎన్నికల్లో మీ దమ్మేందో చూపించండి.. ఓటనే ఆయుధంతో ఉచకోత కోయండి: బండి సంజయ్
Also Read: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ... ప్రపంచంలో ఒకే ఒక్కడు..
అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
AP Politics: టీడీపీ-జనసేన మధ్య సీట్ల కేటాయింపు పూర్తి..! ఎన్ని స్థానాల్లో పోటీ అంటే..?