బీజేపీలోకి టీడీపి ఎంపీల విలీనంపై టీడీపి అభ్యంతరం

టీడీపి రాజ్యసభ సభ్యులను బీజేపిలో విలీనం చేయడాన్నిస‌వాల్ చేస్తూ ఇవాళ టీడీపి లోక్ సభ సభ్యులతోపాటు మిగతా ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుని కలిశారు.

Last Updated : Jun 21, 2019, 08:15 PM IST
బీజేపీలోకి టీడీపి ఎంపీల విలీనంపై టీడీపి అభ్యంతరం

హైద‌రాబాద్‌: టీడీపికి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు గురువారం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందుగా తమను బీజేపి అనుబంధ సభ్యులుగా గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు ఆ నలుగురు సభ్యులు ఓ లేఖ అందివ్వడం, వారి విజ్ఞప్తిని చైర్మన్ ఆమోదించడం వెనువెంటనే జరిగిపోయాయి. 

అయితే టీడీపి రాజ్యసభ సభ్యులను బీజేపిలో విలీనం చేయడాన్నిస‌వాల్ చేస్తూ ఇవాళ టీడీపి లోక్ సభ సభ్యులతోపాటు మిగతా ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుని కలిశారు. ఇదే విషయమై వారు చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీలో చేరిన నలుగురు టీడీపి రాజ్యసభ సభ్యులపై అన‌ర్హ‌త వేటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా మిగతా టీడీపి ఎంపీలు చైర్మన్ వెంకయ్య నాయుడుని డిమాండ్ చేశారు. ప‌ద‌వ షెడ్యూల్‌లోని న‌లుగ‌వ పేరా ప్ర‌కారం న‌లుగురు టీడీపీ ఎంపీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని... రాజ‌కీయ పార్టీ విలీనం అనేది సంస్థాగ‌త స్థాయిలో జ‌ర‌గాలే కానీ అది సభ్యులే ఎవరికి వారు తీసుకునే నిర్ణయం కాదని గల్లా జ‌య‌దేవ్ అన్నారు.

Trending News