కరుణానిధికి నివాళులర్పించిన టీడీపీ ఎంపీలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు నివాళులు అర్పించారు.

Updated: Aug 8, 2018, 12:10 PM IST
కరుణానిధికి నివాళులర్పించిన టీడీపీ ఎంపీలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు నివాళులు అర్పించారు. పార్టీ ఆఫీసులో కరుణ చిత్రపటం వద్ద పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కరుణ సేవలను వారు కొనియాడారు. తమిళనాడు రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. ఆయన మరణం రాజకీయాలకు తీరని లోటు అని, ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, ఎంపీలు రామ్మోహన్ నాయుడు, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, జేసీ దివాకర్ రెడ్డి, మురళీ మోహన్, బుట్టారేణుక తదితరులు ఉన్నారు.

చంద్రబాబు నివాళులు

డీఎంకే అధినేత కరుణానిధి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ద్రవిడ, హిందీ వ్యతిరేక ఉద్యమంలో కరుణానిధి కీలక భూమిక పోషించారన్నారు. దేవెగౌడ, గుజ్రాల్ ప్రభుత్వాల ఏర్పాటులో కరుణానిధిది ప్రధాన పాత్ర అని తెలిపారు. ఎన్టీఆర్‌కు కరుణానిధి అత్యంత సన్నిహితుడని సీఎం గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడే  వ్యక్తి అని, గొప్ప పరిపాలనా దక్షుడు, సామాజిక ఉద్యమ నేత కరుణానిధి అని సీఎం చంద్రబాబు తెలిపారు.