Bhogapuram Airport: ఎయిర్‌పోర్ట్ భూ సేకరణను అడ్డుకున్న గ్రామస్థులు

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంశం మరోసారి వివాదాస్పదమవుతోంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2021, 04:06 PM IST
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణను అడ్డుకున్న బైరెడ్డి పాలెం గ్రామస్థులు, పరిస్థితి ఉద్రిక్తత
  • కనీస సమాాచారం లేకుండా సేకరణ చేస్తున్నారంటూ గ్రామస్థుల ఆగ్రహం
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రోడ్ కోసం 130 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన అదికారులు
Bhogapuram Airport: ఎయిర్‌పోర్ట్ భూ సేకరణను అడ్డుకున్న గ్రామస్థులు

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంశం మరోసారి వివాదాస్పదమవుతోంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఏపీలో విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram international airport) ఏర్బాటుకు నిర్ణయమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమేర భూసేకరణ పూర్తయింది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనుల్ని పీపీపీ విధానంలో జీఎంఆర్ సంస్థకు అప్పగించారు. ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన అదనపు భూసేకరణ కోసం అధికారులు సర్వేకు సిద్ధమవడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు భూసేకరణ సర్వే  ప్రారంభించడంతో ఘర్షణ చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు రంగంలో దిగారు. కనీసం తమను సంప్రదించకుండా భూసేకరణకు ఎలా సిద్ధమవుతారంటూ రైతులు అభ్యంతరం తెలిపారు. 

ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రోడ్‌కు అవసరమైన 130 ఎకరాల భూసేకరణ (Land acquisition)కోసం గతంలోనే నోటిఫికేషన్ జారీ అయింది. ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan)సైతం భోగాపురం ఎయిర్‌పోర్ట్ ( Bhogapuram airport) పనులు త్వరగా పూర్తిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా నిర్ణయించడంతో ఎయిర్‌పోర్ట్‌ను త్వరగా నిర్మించేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ కోసం సేకరించిన భూముల్లో దాదాపు 2 వేల 2 వందల ఎకరాల్ని మాత్రమే జీఎంఆర్‌ (GMR) కు ఇవ్వనున్నారు. మిగిలిన 5 వందల ఎకరాల్ని ప్రభుత్వం ఆధీనంలో ఉంచుతూ కేబినెట్ నిర్ణయించింది. 

Also read: Ap High Court: నిమ్మగడ్డకు హైకోర్టులో షాక్, ఏకగ్రీవాలపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News