ఏపీలో ఇంటింటికి బీజేపీ వచ్చేస్తుంది

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఏం చేసిందో.. భవిష్యత్తులో ఏం చేయబోతుందో తెలియజేసే అవగాహన కార్యక్రమాలకు తాము నాంది పలుకుతున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 

Last Updated : Jun 4, 2018, 06:28 PM IST
ఏపీలో ఇంటింటికి బీజేపీ వచ్చేస్తుంది

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఏం చేసిందో.. భవిష్యత్తులో ఏం చేయబోతుందో తెలియజేసే అవగాహన కార్యక్రమాలకు తాము నాంది పలుకుతున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. "ఇంటింటికి బీజేపీ" అనే పేరుతో ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ప్రజలకు బీజేపీని ఒక విలన్‌గానే చంద్రబాబు పరిచయం చేశారని.. కాకపోతే అది నిజం కాదని కన్నా తెలిపారు. ఒక రకంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా టీడీపీ ప్రవర్తిస్తుందని.. బీజేపీ ప్రజలను మోసం చేసిందనే భావాన్ని ప్రజల్లో కలిగించడానికి ఆ పార్టీ శతవిధాలుగా ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. టీడీపీ రోజు రోజుకీ అవినీతిమయంగా తయారవుతుందని కన్నా అన్నారు. 

ఎన్డీఏ ప్రభుత్వం 156 సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని.. అయితే అందులో కొన్ని పథకాలను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని.. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాహుల్ గాంధీతో కలిసి మంతనాలు చేసే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అదే ఆయన నిజస్వరూపమని.. దీనిని ప్రజలు కచ్చితంగా గమనించాలని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 

Trending News