Tirumala Laddu Controversy: కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్

NTK Leader On Tirumala Laddu Controversy: ఒకవైపు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ గురించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు తమిళనాడు ఎన్‌టీకే పార్టీ లీడర్‌ ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. దేశంలో వేరే ఏ సమస్యలు లేవా? అని నోరుపారేసుకున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Sep 21, 2024, 12:10 PM IST
Tirumala Laddu Controversy: కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్

NTK Leader On Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తెలిసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర దూమారం రాజుకుంది. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీలు కూడా ఈ వివాదంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే, తాజాగా తమిళనాడు ఎన్‌టీకే పార్టీ అధినేత సీమాన్‌ ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ సమస్యలు లేవా? లడ్డూ తప్ప.. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తప్ప జరిగితే చర్యలు తీసుకోండి కానీ, లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు అని వ్యాఖ్యనించారు.

అంతేకాదు, తిరుమల లడ్డూ వివాదాన్ని కావాలని రాజకీయం చేస్తున్నారు. ఇతర సమస్యలపై దృష్టి పెట్టండి అని మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దేశవ్యాప్తంగా ఈ లడ్డూ వివాదంపై దుమారం రేపుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు, చేపనూనె కలిసిందనే ఆరోపణ ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లడ్డూ ల్యాబ్‌ టెస్ట్‌ చేయించారు. రిపోర్టులో జంతు కొవ్వుకు సంబంధించిన పదార్థాలు ఉన్నట్లు వెల్లడైంది.

అయితే, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నాసిరకం నెయ్యి ఉపయోగించడం వల్ల ఇలా జరిగింది. జంతు కొవ్వు ఉన్న నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించినట్లు స్వయానా సీఎం చంద్రబాబు నాయుడు మీడియాకు వెల్లడించారు. జూలైలోనే గుర్తించి నాసిరకం నెయ్యిని తిరుమలకు సరఫరా చేస్తున్న ఏఆర్‌ కంపెనీ తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్‌ను వెంటనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని, కర్నాటకకు చెందిన మరో కాంట్రాక్టర్‌కు అప్పగించామని టీటీడీ ఈఓ జే శ్యామలరావు నిన్న తెలిపారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్‌..  

అంతేకాదు ఈఓ కూడా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్నారు. అందుకే ల్యాబ్‌ టెస్ట్‌కు పంపించాని, ఈ ఘటనకు సంబంధించి విచారణ కూడా చేపడుతున్నామన్నారు. అయితే, లడ్డూ వివాదంపై స్పందించిన వైసీపీ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. అంతేకాదు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కూడా వైసీపీపార్టీపై చేసిన కామెంట్లపై నిన్న జరిగిన ప్రెస్‌ మీట్లో స్పందించారు. జూలై నెలలో ల్యాబ్‌ టెస్ట్‌కు పంపిస్తే ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే కదా అన్నారు. లడ్డూ వివాదం కేవలం డైవర్షన్‌ రాజకీయాలు అని కొట్టిపారేశారు.  

ఇదీ చదవండి:  ప్రతిరోజూ రూ.3 లక్షల లడ్డూ ప్రసాదం.. ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం.. వెలుగులోకి సంచలన విషయాలు..!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా లడ్డూ ఘటనపై మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి పనులు చేయకూడదు అన్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి, దీనికి వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పరమపవిత్రమైన తిరుమల శ్రీనివాసుని లడ్డూ తయారీలో జంతు కొవ్వు ఉందని తెలియడంతో ఆధ్యాత్మిక గురువులు, హిందూ సంఘాలతోపాటు సాధారణ ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం హోం శాఖకు ఫిర్యాదు కూడా చేసింది. నిన్న తెలంగణ బీజేపీ నేత కొంపెల్లా మాధవీలత లడ్డూ కల్తీని అత్యాచారం జరిగిన విధంగా ఆమె పరిగణించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News