ఏపీ సర్కార్‌కు వరల్డ్ బ్యాంక్ షాక్; అమరావతి ప్రాజెక్టు నుంచి ఔట్?

ఏపీ సర్కార్ కు వరల్డ్ బ్యాంక్ షాకిచ్చే నిర్ణయం తీసుకుంది.

Last Updated : Jul 18, 2019, 10:50 PM IST
ఏపీ సర్కార్‌కు వరల్డ్ బ్యాంక్ షాక్; అమరావతి ప్రాజెక్టు నుంచి ఔట్?

స్థానిక ప్రజానికం నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతున్న కారణంతో రాజధాని అమరావతి ప్రాజెక్టు నుంచి  వరల్డ్‌ బ్యాంక్‌ తప్పుకున్నట్లు మీడియాలో కథనాలు వెలుడుతున్నాయి. ప్రముఖ మీడియా కథనం ప్రకారం అమరావతి సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకున్నట్లు తెలిసింది. ఇదే నిజమైతే 300 మిలియన్‌ డాలర్ల రుణ సాయం రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా పోతుంది.  అయితే దీనిపై సీఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీ నరసింహం స్పందిస్తూ  ప్రపంచబ్యాంక్‌ నుంచి తప్పుకుంటున్నట్లు తమకు అధికారిక సమాచారమేదీ లేదని పేర్కొన్నారు.

రైతుల వ్యతిరేకతే కారణం ?
ప్రముఖ మీడియా కథనం ప్రకారం రైతులు, ప్రజా సంఘాల ఫిర్యాదుల నేపథ్యంలో ప్రపంచబ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి అభివృద్ధి కోసం మొత్తం 715 మిలియన్‌ డాలర్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా...దరఖాస్తున్న స్వీకరించి అన్ని అంశాలు బేరీజుకొని 300 మిలియన్‌ డాలర్ల రుణం అందించేందుకు ప్రపంచబ్యాంకు సిద్ధమైంది. 

నగర నిర్మాణంతో పర్యావరణానికి హాని
సరిగ్గా ఇదే తరుణంలో అమరావతి నగర ప్రాంతంలో నివసిస్తున్న కొందరు రైతులు ప్రపంచబ్యాంకు తనిఖీ ప్యానెల్‌కు ఫిర్యాదు చేశారు. అమరావతి నగర నిర్మాణం తమ జీవనాధారానికి హాని చేస్తోందని..ఇది పర్యావరణానికి, ఆహారభద్రతకు ఇది భంగం కలిగిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతున్న నేపథ్యంలో అమరావతి నగర అభివృద్ధి ప్రాజెక్టుకు అందించాల్సిన  రుణ  సాయం విషయంలో ప్రపంచబ్యాంక్‌ డైలమాలో పడింది. ఉన్నతస్థాయిలో చర్చలు జరిపిన బ్యాంకు ప్రతినిధులు చివరికి ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు తెలిసింది.

Trending News