Devipriya: ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ దేవిప్రియ కన్నుమూత

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత దేవిప్రియ కన్నుమూరు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Last Updated : Nov 21, 2020, 12:25 PM IST
Devipriya: ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ దేవిప్రియ కన్నుమూత

Writer, Journalist Devipriya passes away: హైదరాబాద్‌: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత దేవిప్రియ (Devipriya) కన్నుమూరు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస (devipriya passes away) విడిచారు. ఉదయం 7 గంటలకు దేవిప్రియ కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని అల్వాల్‌లోని ఇంటికి తరలించారు. కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతన్న దేవిప్రియ నవంబరు 6న ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. దేవిప్రియ మృతి పట్ల తెలుగు సాహితీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు సంతాపం ప్రకటించి, నివాళులు అర్పించారు. 

దేవిప్రియ

కవిగా, పాత్రికేయుడిగా, సినీగేయ రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేవిప్రియ 2017లో "గాలిరంగు" కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ (Sahitya Akademi) అవార్డును అందుకున్నారు. సమకాలీన రాజకీయ, సాంఘిక స్థితిగతుల్ని కవిత్వం ద్వారా చెబుతూ ‘రన్నింగ్‌ కామెంటరీ’ కవిగా పేరొందిన దేవీప్రియ 1951 ఆగస్టు 15 తేదీన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా  పల్నాడులోని ఓబులేశునిపల్లెలో జన్మించారు. దేవిప్రియ అసలు పేరు షేక్ ఖాజాహుస్సేన్. Also raed: Uttar Pradesh: కల్తీ మద్యం తాగి నలుగురు మృతి

గుంటూరు కేంద్రంగా అవతరించిన పైగంబర కవులు బృందంలో దేవిప్రియ ఒకరు. సినిమా రంగంపై సాధికారమైన వ్యాసాలు రాసిన దేవిప్రియ, దాసి, రంగులకల మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు కూడా రాశారు. మనోరమ పత్రిక వ్యవస్థాపకుడిగా, హైదరాబాద్ మిర్రర్ ప్రధాన సంపాదకులుగా దేవిప్రియ సుపరిచితులు. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు రచనా లోకానికి, పాత్రికేయ రంగానికి సేవలందించిన దేవీప్రియ.. అమ్మచెట్టు, గరీబుగీతాలు, నీటిపుట్ట, అరణ్యపురాణం వంటి అనేక రచనలు చేశారు. దేవీప్రియ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. Also raed: Chhath Puja: అత్యంత వైభవంగా ఛత్ పూజ

Avantika Mishra: అవంతిక మిశ్రా బ్యూటిఫుల్ పిక్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News