గ్రూప్ -2 పరీక్షలు వాయిదా వేయాల్సిందే - వైసీపీ నేత విజయసాయిరెడ్డి

ఎన్నికల కోడ్ ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది

Last Updated : May 4, 2019, 11:44 AM IST
గ్రూప్ -2 పరీక్షలు వాయిదా వేయాల్సిందే - వైసీపీ నేత విజయసాయిరెడ్డి

ఏపీ సర్కార్  నిర్వహించతలపెట్టిన గ్రూప్ -2 పరీక్షల వాయిదా వేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.  ఒకపక్క ఎన్నికల కోడ్ అమలులో ఉండటం మరో పక్క ఫొని తుపాను బాధితుల కోసం సహాయక, పునరావాస చర్యలు సాగుతున్నాయి..అవేవి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.

 గ్రూప్ -2 పరీక్షల విషయంలో ప్రభుత్వం దేనికో హడావుడి పడుతున్నట్టు కనిపిస్తోందని విజయసాయి అనుమానం వ్యక్తం చేశారు. పరీక్షలు ఒక నెల రోజులు ఒపిక పడితే పోయేదేంటని విజయసారెడ్డి ప్రశ్నించారు.ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలి ట్విట్టర్ వేదికపై విజయసాయిరెడ్డి కోరారు.

 

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏపీలో గ్రూప్-2 ప్రిలిమ్స్‌ పరీక్షను రం మే 5న నిర్వహించేందుకు  ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను కూడా అందుబాటులో ఉంచింది.   మొత్తం 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి కోసం నిర్వహిస్తున్న పరీక్ష  కోసం దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో సరిగా ప్రేపేర్ కాలేదని..కనీసం నెల రోజుల వరకు ఈ పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్ధులు ఏపీపీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వీరి విన్నపాన్ని తిరస్కరించిన ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఈ మేరకు ట్వీట్ చేశారు
 

Trending News