Avinash reddy on CBI: ముగిసిన సీబీఐ విచారణ, సీబీఐ తీరుపై అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Avinash reddy on CBI: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ అంతా ఏకపక్షంగా సాగుతోందని ఆరోపించారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2023, 06:51 PM IST
Avinash reddy on CBI: ముగిసిన సీబీఐ విచారణ, సీబీఐ తీరుపై అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతమౌతోంది. వివేకాను హత్య చేయించింది అవినాష్ రెడ్డేనని..ఇందుకు ప్రాధమిక ఆధారాలున్నాయని తెలిపిన సీబీఐ..రెండవసారి అవినాష్ రెడ్డిని ఇవాళ విచారించింది.

ఇవాళ జరిగిన అవినాష్ రెడ్డి విచారణ చాలా ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందనే ప్రచారం ముమ్మరంగా సాగింది. అందర్ని అంచనాల్ని తలకిందులు చేస్తూ విచారణ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు వైఎస్ అవినాష్ రెడ్డి. ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సీఆర్పీసీ 160 కింద నోటీసు ఇచ్చి విచారించారని..మళ్లీ పిలుస్తామని చెప్పలేదన్నారు. విచారణ మొత్తం తనను టార్గెట్ చేస్తూ ఏకపక్షంగా సాగిందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. 

ఏడాది క్రితం తెలుగుదేశం చెప్పిన అంశాల్నే సీబీఐ కౌంటర్ పిటీషన్‌లో పేర్కొనడంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తనకున్న సందేహాల్ని, సమాచారాన్ని ఓ వినతి పత్రంగా సీబీఐకు ఇచ్చానన్నారు. వివేకా హత్య జరిగిన రోజు లభించిన లేఖను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు మీడియాతో ముందు మాట్లాడింది తానేనన్నారు. ఆ ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు అవినాష్ రెడ్డి చెప్పారు. విచారణలో ఎక్కడా కనీసం ఆడియో రికార్డింగ్ కూడా లేదని..న్యాయవాదుల్ని అనుమతించాలని కోరినా సీబీఐ అంగీకరించలేదన్నారు. 

గూగుల్ టేక్ ఔట్‌ను గతంలో టీడీపీ ప్రస్తావిస్తే..ఇప్పుడు సీబీఐ కౌంటర్ పిటీషన్‌లో పేర్కొందన్నారు. విచారణ పూర్తిగా ఏకపక్షంగా సాగుతోందన్నారు. తనను సాక్షిగా విచారించారో, నిందితునిగా విచారించారో తెలియడం లేదన్నారు. సీబీఐ అడిగిన ప్రశ్నలకు తెలిసిన సమాధానాలు చెప్పానన్నారు. తప్పుడు వార్తలు ప్రచురించకుండా..నిజాన్ని నిజంగా వేయాలని అవినాష్ రెడ్డి మీడియాను కోరారు. 

విచారణ సరైన దిశలో జరగాలనే తాను కోరుతున్నానన్నారు. వాస్తవాన్ని ఛేధించకుండా తనను టార్గెట్ చేస్తున్నారని అవినాష్ రెడ్డి తెలిపారు. ఓ వైపు విచారణ జరుగుతుండగానే మీడియా ట్రయల్ చేస్తూ దోషులెవరో తేల్చేస్తుందన్నారు. మీడియా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. 

Also read: Viveka Murder Case: వివేకా హత్య కేసులో రెండవసారి విచారణకు అవినాష్ రెడ్డి, ఇవాళ అరెస్టు తప్పదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News