వైసీపీ నేత జగన్ పై దాడి.. ఆ టీడీపీ నేతకు నిందితునితో సంబంధాలున్నాయా?

వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై గురువారం వైజాగ్ ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. 

Last Updated : Oct 25, 2018, 03:16 PM IST
వైసీపీ నేత జగన్ పై దాడి.. ఆ టీడీపీ నేతకు నిందితునితో సంబంధాలున్నాయా?

వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై గురువారం వైజాగ్ ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. అయితే ఈ దాడిలో ఆయనకు పలు గాయాలయ్యాయి. ఎయిర్ పోర్టు క్యాంటిన్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి జగన్ పై కత్తితో దాడి చేసినట్లు  సమాచారం. అతనిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తొలుత సెల్ఫీ తీసుకోవడానికి జగన్ వద్దకు వచ్చిన ఆ వ్యక్తి.. ఉన్నట్టుండి దాడి చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని పోలీసులు ఎంక్వయరీ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.

దాడికి పాల్పడిన వ్యక్తి పేరు శ్రీనివాస్ అని.. ఆయన అమలాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు. కోడిపందేళ్ళలో పక్షుల కాలికి కట్టే పదునైన కత్తితో ఈ దాడి చేయడానికి వ్యక్తి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టు క్యాంటిన్ కాంట్రాక్టు టీడీపీ నేత హర్షవర్ధన్ ఆధ్వర్యంలో నడుస్తుందని.. కనుక ఈ దాడిలో ఆయన పాత్ర ఏమైనా ఉందా అన్న అంశంపై ఎంక్వయరీ చేసే అవకాశం ఉందని పలువురు చెబుతున్నట్లు డీఎన్ఏ వెబ్ సైటులో పేర్కొనడం జరిగింది.  

ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెకింగ్ జరిగాక జగన్ బయటకు వచ్చిన వెంటనే ఈ దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించామని తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి వెనుక లాంటి గొప్ప వ్యక్తులున్నా సరే తాము చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయం జరగడంతో ఆయనకు ప్రాథమిక చికిత్స చేయడం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఏపీ డీజీపీకి గవర్నర్‌ నరసింహన్‌ ఫోన్‌ చేశారు. తక్షణ నివేదిక అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు  డిమాండ్‌ చేశారు.

Trending News