Pawan Kalyan Comments: ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సారధ్యంలోని కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే ఇటీవల ఆయన రెండు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షం వైసీపీకు ఊతమిస్తున్నాయి.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రచ్చ రేపుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, డీజీపీ సహా పోలీసుల వైఖరి, హోంమంత్రి అనిత నిర్లక్ష్యంపై పవన్ కళ్యాణ్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఓ దశలో అయితే హోంమంత్రిత్వ శాఖను తాను తీసుకోవల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. తానే హోంమంత్రి అయితే యూపీ ముఖ్యమంత్రి యోగిలా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పసిపిల్లలపై ఆకృత్యాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీకు ఊతమిస్తున్నాయి. లబ్ది చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలపై తాము చెబుతున్నది నిజమేనని సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి అంగీకరించారని వాదిస్తోంది. అందుకే ఈ వ్యాఖ్యల్ని పనిగట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది.
మరోవైపు ఇటీవల ఓ ప్రభుత్వ స్కూల్‌ను సందర్శించిన ఆయన ప్రైవేట్ స్కూల్ కంటే బాగుందంటూ మెచ్చుకున్నారు. గతంలో అంటే 2017లో పపవన్ కళ్యాణ్ పాఠశాలల్ని సందర్శించిన ఫోటోలు, ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో పాఠశాలల్ని సందర్శించిన ఫోటోల్ని షేర్ చేస్తూ వైరల్ చేస్తోంది. నాడు నేడు పధకంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్ని చాలావరకు అభివృద్ధి చేసింది. తాము చేసిన అభివృద్ధికి నిదర్శనమే పపన్ కళ్యాణ్ వ్యాఖ్యలంటూ అదే పనిగా వైరల్ చేస్తోంది.
మొత్తానికి ఈ రెండు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెంచుతున్నాయి. అందుకే పనిగట్టుకుని తమ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి.
Also read: Pawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.