జీ న్యూస్.. ఇక తెలుగులో కూడా..

ఎల్లప్పుడు రాగద్వేషాలతో.. కామ క్రోధాలతో.. హింసాత్మక చర్యలతో రక్తసిక్తమవుతున్న ఈ మానవాళి సామ్రాజ్యంలో కమ్ముకున్న కడు చీకట్లను తొలిగించి..  ప్రేమ, దయ, కరుణ వంటి భావాలతో సమాజాన్ని సంస్కరించడమే  ధ్యేయంగా మీ ముందుకు వస్తోంది జీ న్యూస్ తెలుగు

Last Updated : Jan 19, 2018, 04:44 PM IST
జీ న్యూస్.. ఇక తెలుగులో కూడా..

"అక్షర సేద్యం చేస్తూ..  విజ్ఞానమనే వరాన్ని అందించడమే మా లక్ష్యం"

"ఎల్లప్పుడు రాగద్వేషాలతో.. కామ క్రోధాలతో.. హింసాత్మక చర్యలతో రక్తసిక్తమవుతున్న ఈ మానవాళి సామ్రాజ్యంలో కమ్ముకున్న కడు చీకట్లను తొలిగించి..  ప్రేమ, దయ, కరుణ వంటి భావాలతో సమాజాన్నిసంస్కరించడమే మా ధ్యేయం"

"జీ మీడియా కార్పొరేషన్"..భారతదేశంలో పరిచయం అక్కర్లేని పేరు ఇది. ప్రేక్షకుల మదిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం వల్లే,  ఈ దిగ్గజ మీడియా అనుబంధ సంస్థైన జీ న్యూస్‌కు ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ ఫలితంగానే ఈ రోజు జీ మీడియా ఈ స్థాయిలో నిలిచింది. వేలమంది పాత్రికేయులు తమ మేధస్సును పెట్టుబడిగా పెట్టి అహర్నిశలు శ్రమించిన ఫలితంగానే ఈ రోజు జీ న్యూస్ మీ ముందు ఇలా ఆవిష్కృతమైంది. 

మేధో సమాజమే "జీ" లక్ష్యం..
ప్రజలకు విలువైన సమాచారాన్ని చేరవేస్తూ,  సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో జీ మీడియాకి ఎవరూ సాటి రారంటే అతిశయోక్తి కాదు. జీ మీడియాకి ఎవరితోనూ పోటీ లేదు.. దానికదే పోటీ.. అన్న ధోరణిలో ముందుకు వెళ్తోంది.  మేధో సమాజాన్ని స్థాపించడమనే మహోన్నత లక్ష్యంతో ముందుకు వెళ్తూ, సామాన్యుడి సమస్యలను పరిష్కరించేందుకు జీ మీడియా చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు...గత కొన్ని దశాబ్దాల నుండీ దేశంలో సామాజిక, ఆర్ధిక, రాజకీయ వ్యవస్థలతో పాటు అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న జీ న్యూస్ ఈ రోజు మీ మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచింది. అలాగే కేవలం సమాచారానికే పరిమితం కాకుండా వివిధ వర్గాల వారికి వినోదాన్ని పంచుతూ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా స్థానం సంపాదించింది జీ మీడియా. 
ప్రాంతీయ భాషల్లోనూ జీ న్యూస్..
కాలానుగుణంగా మార్పు చెందడం జీ న్యూస్ నైజం.. మొన్నటి వరకు టెలివిజన్‌కు పరిమితమైన జీ న్యూస్.. ఇంటర్నెట్ విప్లవం రావడంతో డిజిటల్ రంగంలో కూడా అడుగుపెట్టింది. డిజిటల్ రంగంలో అడుగుపెట్టినప్పటి నుండీ ఇప్పటి వరకు  జెట్ స్పీడ్ లో దూసుకెళ్తూ..ప్రజలకు విలువైన సమాచారాన్ని అందిస్తోంది. అయితే ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషలకే  పరిమితమైన జీ న్యూస్  తన డిజిటల్ సేవలను దేశ నలుమూలల్లో ఉన్న ప్రజలందరికీ చేర్చాలనే ఉద్దేశంతో తన విస్తరణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషల్లో కూడా తమ సేవలను అందించేందుకు సమాయత్తమైంది.  అ ప్రక్రియలో  భాగంగానే ఈ రోజు జీ న్యూస్ డిజిటల్ వెర్షన్ .. తెలుగు భాషలో కూడా మీ ముందుకు వచ్చింది. జీ న్యూస్‌ను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మీరు కూడా నిండు మనస్సుతో ఆశీర్వదించండి ప్లీజ్...
                                                                                                                        మీ 
                                                                                                             జీ న్యూస్ తెలుగు టీం 

 

Trending News