7th Pay Commission-DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న రోజు మరెంతో దూరంలో లేదు. డీఏ పెరగనుంది. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడనే విషయంపై స్పష్టత వచ్చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ పెరగాల్సి ఉంది. ఇప్పుడా డీఏకు సంబంధించి ఇప్పటికే వివరాలు వెలువడ్డాయి. ఇప్పుడు డీఏ పెంపు ప్రకటన ఎప్పుుడనే విషయంపై స్పష్టత వచ్చింది. ఏఐసీపీఐ సూచీ ప్రకారం జూన్ వరకూ అందిన గణాంకాల ప్రకారం కరవు భత్యం 4 శాతం పెరగనుందని పక్కాగా తెలిసింది. డీఏ పెంపుపై సెప్టెంబర్ 28న జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ప్రకటన రానుంది. అంటే సెప్టెంబర్ జీతం భారీగా రానుంది.
ఎరియర్లతో కలిపే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త కరవు భత్యం జూలై 1, 2022 నుంచి వర్తించనుంది. అంటే సెప్టెంబర్ జీతంలో ఆ నెల పెరిగిన డీఏతో పాటు గత మూడు నెలల ఎరియర్లతో కలిపి లభిస్తుంది. అంటే సెప్టెంబర్ జీతం పెద్దమొత్తంలో అందనుంది. ఏఐసీపీఐ సూచీ ప్రకారమే డీఏ పెంపు ఉంటుంది. ఈసారి జూలై 2022లో డీఏలో 4 శాతం పెంపు ఉంటుంది. అంటే ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరుకోనుంది.
కార్మిక శాఖ లెక్కల ప్రకారం కరవు భత్యం ఆధారిత ఏడాది 2016లో మార్పు జరిగింది. వేజ్ రేట్ ఇండెక్స్ కొత్త సిరీస్ జారీ చేసింది. అంటే డబ్ల్యూఆర్ఐ కొత్త సిరీస్ 1963-65 పాత సిరీస్ స్థానంలో ఉంటుంది.
Also read: Facebook Services: అక్టోబర్ 1 నుంచి ఫేస్బుక్లో ఆ ఫీచర్ బంద్, ప్రత్యామ్నాయమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook