అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ తీసుకొస్తున్న ఎఫ్‌పీవోపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. 20 వేల కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ కోసం షేర్ మార్కెట్‌లో ప్రతిపాదన పత్రాలు సమర్పించింది. ఈ ఎఫ్‌పీవో జనవరి 27న ఓపెన్ అయి..జనవరి 31న క్లోజ్ అవుతుంది.
ఎఫ్‌పీవో. అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఈ ఎఫ్‌పీవోను జనవరి 27న ప్రవేశపెడుతోంది. అదే రోజు ఓపెన్ అయి జనవరి 31న క్లోజ్ అవుతుందియ ఈ ఎఫ్‌పీవో ద్వారా కంపెనీ 3112 నుంచి 3276 రూపాయలు ప్రతి షేర్ విలువను నిర్దారించారు. బీఎస్ఈపై నిన్న బుధవారం నాడు కంపెనీ షేర్ 3,595.35 రూపాయలకు క్లోజ్ అయింది.
ఈ డబ్బులు ఎక్కడ వినియోగిస్తుంది
ఎఫ్‌పీవో ద్వారా లభించే 20 వేల కోట్ల రూపాయల్లోంచి 10,869 రూపాయల వినియోగం గ్రీన్ హైడ్రోజన్ కార్యకలాపాలు, ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కోసం వెచ్చించనుంది. దీంతోపాటు 4,165 కోట్ల రూపాయలతో విమానాశ్రయాలు, రోడ్లు, సౌర విద్యుత్ ప్లాంట్స్‌లపై వివిధ సంస్థల్నించి తీసుకున్న అప్పును చెల్లించనుంది.
అదానీ గ్రూప్ ఒక వ్యాపారిలా ప్రారంభమై ఇవాళ అది కాస్తా పోర్టులు, మైనింగ్, విమానాశ్రయాలు, డేటా కేంద్రాలు, సిమెంట్‌తో పాటు గ్రీన్ ఎనర్జీ వరకూ విస్తరించింది. ఏఈఎల్ అనేది ఇండియాలో అతిపెద్ద లిస్టింగ్ వ్యాపారపు ఇన్‌క్యుబేటర్‌గా ఉంది. ఇది ఎనర్జీ, యుటిలిటీస్, ట్రాన్స్‌పొర్టేషన్, లాజిస్టిక్స్, కన్జ్యూమర్ రంగాల్లో ఉంది.
గత కొన్నేళ్లుగా అదానీ గ్రూప్ కొత్త వ్యాపారాల్ని స్థాపించేందుకు మద్దతు ఇచ్చింది. వాటిని స్వీయ నిర్వహణ వ్యాపార విభాగంగా అభివృద్ది చేసి ఆ తరువాత స్వతంత్ర లిస్టింగ్ వేదికగా వేరుచేసింది. ప్రస్తుతం కంపెనీ ఒక గ్రీన్ హైడ్రోజన్ ఎన్విరాన్‌మెంటల్ వ్యవస్థ, డేటా కేంద్రం, విమానాశ్రయాలు, రోడ్లు, ఫుడ్ ఎఫ్‌ఎంసీజీ, డిజిటల్, మైనింగ్, రక్షణ, పరిశ్రమల స్థాపనలో ఉంది.
కంపెనీ కొత్త అవసరాలతో ప్రయోజనం పొందుతోంది. ఇందులో గ్రీన్ హైడ్రోజన్, విమానరంగం, డేటా కేంద్రం ఉంది. కంపెనీ అప్పు సెప్టెంబర్ 30, 2022 నాటికి 40, 023.50 కోట్ల రూపాయలుంది.
Also read: Adani Energy: కొత్త ఏడాదిలో అదానీ కంపెనీ మరో టేకోవర్, ఎనర్జీ కంపెనీలో 50 శాతం వాటా కొనుగోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook