Amazon Offers: మరి కొద్దిరోజుల్లో అద్భుత ఆఫర్లు, డిస్కౌంట్లతో అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ 2022 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి సేల్‌లో ఏయే వస్తువులపై డిస్కౌంట్ లభించనుందో తేలిపోయింది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 10, 2022, 11:49 PM IST
Amazon Offers: మరి కొద్దిరోజుల్లో అద్భుత ఆఫర్లు, డిస్కౌంట్లతో అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ 2022 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి సేల్‌లో ఏయే వస్తువులపై డిస్కౌంట్ లభించనుందో తేలిపోయింది. ఆ వివరాలు మీ కోసం..

అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2022 మరి కొద్దిరోజుల్లో అంటే సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఫెస్టివల్ సీజన్ సేల్‌లో ఎస్బీఐ కస్టమర్లకు తక్షణ డిస్కౌంట్ 10 శాతం లభిస్తోంది. దీంతోపాటు కస్టమర్ల తొలి కొనుగోలుపై 10 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎం, ఐక్యూ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ సభ్యులకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్‌లో ఎంట్రీ ఉంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. సేల్ సందర్భంగా వన్‌ప్లస్, శాంసంగ్, షియోమీ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, యాక్సిసెరీస్‌పై 40 శాతం మినహాయింపు ఉంది. ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌పై కూడా అదే డిస్కౌంట్ లభిస్తుంది. 

రెడ్‌మి 11 ప్రైమ్ 5జి, ఐక్యూ జెడ్ 6 లైట్ 5జి, ఐఫోన్ 14 సిరీస్ వంటి కొత్త ఉత్పాదనలు అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

75 శాం వరకూ డిస్కౌంట్‌తో ల్యాప్‌ట్యాప్, స్మార్ట్‌వాచ్, హెడ్ ఫోన్ వంటి ఇతర ఉత్పాదనలున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2022 సందర్బంగా ప్రతి 6 గంటలకు జారీ చేస్తున్న అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్ గురించి తెలియనుంది. గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2022 సేల్ ప్రారంభంలో అమెజాన్‌పై..చాలా ఇతర డీల్స్ ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా 10 శాతం డిస్కౌంట్ ఉంది. ఈ సేల్ కేవలం రెండ్రోజులు మాత్రమే ఉంటుంది. సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 25 వరకూ అందుబాటులో ఉంటుంది.

అమెజాన్‌లో ఇంకా వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై 15 వేల డిస్కౌంట్ లభించనుంది. దీంతోపాటు ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. 

Also read: Post Office Schemes: గ్యారంటీ, అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చే పోస్టాఫీసు పథకాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News