Amazon Prime Day Sale 2023: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో పిచ్చెకించే ఆఫర్స్‌, డెడ్‌ ఛీప్‌ ధరలకే ఈ స్మార్ట్ ఫోన్స్‌

Amazon Prime Day Sale 2023: ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌ సైట్‌ అమెజాన్‌లో అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ లభించబోతోంది. అయితే ఏయే ఎలక్ట్రిక్‌ వస్తువుపై ఎంత డిస్కౌంట్‌ లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 12, 2023, 10:43 AM IST
Amazon Prime Day Sale 2023: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో పిచ్చెకించే ఆఫర్స్‌, డెడ్‌ ఛీప్‌ ధరలకే ఈ స్మార్ట్ ఫోన్స్‌

 

Amazon Prime Day Sale 2023 Offers: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ జూలై 15 తేదిన ప్రారంభం కాబోతోంది. రెండు రోజు పాటు కొనసాగే ఈ మెగా సేల్‌లో అన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులను భారీ తగ్గింపుతో అమెజాన్ విక్రయించబోతోంది. ముఖ్యంగా ఈ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా అన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై 30 నుంచి 40 శాతం తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా అదనంగా డిస్కౌంట్‌ పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ముఖ్యంగా ఈ క్రమంలో స్మార్ట్‌ టీవీలు, మొబైల్‌ ఫోన్స్‌ కొనుగోలు చేసేవారికి సువర్ణ అవకాశంగా భావించవచ్చు.

ఈ బ్యాంకు కార్డులపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌:
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ICICI, SBI క్రెడిట్‌ కార్డులపై 10 శాతం తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్‌ వస్తువులపై అదనపు డిస్కౌంట్స్‌ను కూడా అందిస్తోంది. ఇక భారీ మొత్తంలో డిస్కౌంట్‌ పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ ద్వారా ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా లభిస్తోంది. దీంతో మీరు ఏ ఎలక్ట్రిక్‌ వస్తువును కొనుగోలు చేసిన డెడ్‌ ఛీప్‌ ధరలకే లభించనున్నాయి.

Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన  

ఈ స్మార్ట్‌ ఫోన్స్‌పై పిచ్చెకించే డిస్కౌంట్స్‌:
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా మోటరోలా రేజర్ 40, మోటరోలా రేజర్ 40 అల్ట్రా సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేస్తే..రూ.7000 ఫ్లాట్ తగ్గింపును లభించనుంది. అంతేకాకుండా మిడ్‌ రేంజ్‌ స్మార్ట్ ఫోన్స్‌ Redmi 50iపై కూడా రూ. 3,000 వరకు అదపు డిస్కౌంట్‌ను అందిచబోతునట్లు అమెజాన్ పేర్కొంది. ఇక మార్కెట్‌లో ఎంతో డిమాండ్‌ ఉన్న QOO 11 స్మార్ట్‌ఫోన్‌ ఈ సేల్‌లో భాగంగా రూ.49,000లకే లభించబోతోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్స్‌పై అదనంగా ఎక్చేంజ్‌ బోనస్‌ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

డెడ్‌ ఛీప్‌కే iPhone 14:
ఈ సేల్‌లో భాగంగా iPhone 14 స్మార్ట్‌ ఫోన్‌ డెఢ్‌ చీప్‌కే లభించబోతోంది. మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ. 50 వేలలోపే లభించే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా బేస్ వేరియంట్ ధర రూ. 66,999లుగా ఉండబోతోంది. ఇదే కాకుండా ఫైర్ టీవీ స్టిక్, ఇయర్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్స్‌పై కూడా భారీ డిస్కౌంట్‌ లభించబోంది. 

ఈ స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌:
ప్రైమ్ డే సేల్‌లో Realme Narzo N53 స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌తో విక్రయించబోతోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ అసలు ధర రూ.10,999 ఉండగా ఈ సేల్‌లో రూ. 10,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండబోతోంది. OnePlus Nord CE 3 Liteపై కూడా ఇలాంటి ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.20,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయోచ్చు. 

Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News