Amazon Offers: అమెజాన్‌ అద్భుత ఆఫర్.. రూ.33 వేలు చేసే శాంసంగ్ 5జీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7449కే..

Amazon Smart Phone Offers: తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్‌లో బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.   

Written by - Srinivas Mittapalli | Last Updated : Jun 28, 2022, 12:47 PM IST
  • అమెజాన్ అందిస్తున్న లేటెస్ట్ ఆఫర్స్
  • స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్
  • శాంసంగ్ గెలాక్సీ ఎం53పై ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు
Amazon Offers: అమెజాన్‌ అద్భుత ఆఫర్.. రూ.33 వేలు చేసే శాంసంగ్ 5జీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7449కే..

Amazon Smart Phone Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై బంపరాఫర్ అందిస్తోంది. పలు బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లపై ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ (మిస్టిక్ గ్రీన్, 6జీబీ, 128 జీబీ స్టోరేజ్) స్మార్ట్ ఫోన్ అతి చౌక ధరకే అందుబాటులో ఉంది. రూ.33 వేలు విలువ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌ని అమెజాన్‌ అందిస్తున్న ఆఫర్‌తో రూ.7449కే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ :

శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ (మిస్టిక్ గ్రీన్, 6జీబీ, 128 జీబీ స్టోరేజ్) స్మార్ట్ ఫోన్ సాధారణ ధర రూ.32,999. అమెజాన్ దీనిపై 20 శాతం తగ్గింపు అందిస్తోంది. డిస్కౌంట్ పోను ఈ స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.26,499కే కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.1247తో ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంది.

అమెజాన్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ :

శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ (మిస్టిక్ గ్రీన్, 6జీబీ, 128 జీబీ స్టోరేజ్) స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే.. దాని కండిషన్‌ని బట్టి రూ.19050 వరకు తగ్గింపు పొందుతారు. అంటే.. రూ.26,499కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.7449కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లకు షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి.

శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ ఫీచర్స్ :

108 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా
6.7 అంగుళాల సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్‌ప్లే
ఎంటీకే డీ900 ఆక్టా కోర్ 2.4GHz 6nm ప్రాసెసర్
5000 mAh బ్యాటరీ
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ స్టోరేజ్
లేటెస్ట్ ఆండ్రాయిండ్ v12.0, One UI 4 ఆపరేటింగ్ సిస్టమ్ 

 

Also Read: TS Inter Results Live Updates: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల.. ఫలితాల్లో బాలికలదే పైచేయి

Also Read: Covid 19 Cases in India: నిన్నటి కంటే కేసులు తగ్గినా.. పెరిగిన మరణాలు.. దేశంలో లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News