Bank Holidays in October 2023: అక్టోబర్ నెలలో సగం రోజులు బ్యాంక్ సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..

Bank Holidays in October 2023: ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. బ్యాంకు సెలవుల పూర్తి జాబితాలో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. 

Written by - Pavan | Last Updated : Sep 26, 2023, 11:37 PM IST
Bank Holidays in October 2023: అక్టోబర్ నెలలో సగం రోజులు బ్యాంక్ సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..

Bank Holidays October 2023: న్యూఢిల్లీ: అక్టోబర్ నెల అంటేనే పండగల సీజన్. యావత్ భారతదేశం జరుపుకునే దసరా పండగతో పాటు మరెన్నో ఇతర తిధులు, పవిత్ర దినాలు ఈ అక్టోబర్ నెలలోనే వస్తున్నాయి. ఆయా ప్రత్యేక దినాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అదే సమయంలో ఒకవేళ మీకు ఏదైనా బ్యాంకులో పనిపడితే.. తీరా మీరు బ్యాంకుకి వెళ్లేటప్పటికి అక్కడ ఇవాళ బ్యాంక్ హాలీడే అనే బోర్డు దర్శనం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఏయే దినాల్లో బ్యాంకులకు సెలవులు వస్తున్నాయో ముందుగానే తెలిసి ఉంటే.. దానినిబట్టే మీ బ్యాంకు పనులు మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాంకు పని అవకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నెలలో బ్యాంకు సెలవుల పూర్తి జాబితా ఇలా ఉంది. ఇదే జాబితాలో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రాంతాల వారీగా, వారి సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, పండగలను బట్టి ఆయా సెలవు దినాలు కూడా మారుతూ ఉంటాయి. అలా వచ్చే అక్టోబర్ నెలలో, మొత్తం 15 రోజులకు పైగా సెలవులు వస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి. 

అక్టోబర్ 2023 బ్యాంక్ సెలవులు పూర్తి జాబితా

అక్టోబర్ 2వ తేదీ , 2023 - మహాత్మా గాంధీ

అక్టోబర్ 12వ తేదీ , 2023 – నరక చతుర్దశి

అక్టోబర్ 14వ తేదీ , 2023 - 2వ శనివారం

అక్టోబర్ 15వ తేదీ , 2023 - ఆదివారం

అక్టోబర్ 18వ తేదీ , 2023 - కటి భియు ( అస్సాం )

అక్టోబర్ 19వ తేదీ , 2023 - సంవత్సరాది పండుగ ( గుజరాత్ )

అక్టోబర్ 21వ తేదీ , 2023 - దుర్గా పూజ ( మహా సప్తమి )

అక్టోబర్ 22వ తేదీ , 2023 - దుర్గా పూజ

అక్టోబర్ 23వ తేదీ , 2023 - మహా నవమి

అక్టోబర్ 24వ తేదీ , 2023 - విజయ దశమి పండగ సెలవు

అక్టోబర్ 28వ తేదీ , 2023 - లక్ష్మీ పూజ

అక్టోబర్ 31వ తేదీ , 2023 - సర్దార్ వల్లభ భాయ్ పటేల్ పుట్టిన రోజు

ఇలా అక్టోబర్ నెలలో వచ్చే బ్యాంకుల సెలవు దినాల గురించి ముందుగానే తెలిసి ఉంటే.. ఏవైనా బ్యాంకు లావాదేవీలు ఉన్నప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకుని ఇబ్బందులుపడకుండా ఉండటానికి వీలు ఉంటుంది.

Trending News