Fixed Deposit Interest Rates: ప్రస్తుతం మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే మనం పెట్టిన డబ్బు సురక్షితంగా ఉండడంతోపాటు మంచి లాభాలు రావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఒక ఏడాది ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నారా..? తక్కువ టైమ్‌లోనే ఎక్కువ వడ్డీని అందించే బ్యాంకులు చాలానే ఉన్నాయి. 7 రోజుల నుంచి 12 నెలల మధ్య ఫిక్స్డ్ డిపాజిట్స్‌పై అధిక వడ్డీ ప్రయోజనం అందించే బ్యాంకుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సాధారణ పౌరులకు 3 శాతం నుంచి 6 శాతం వరకు 7 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఎఫ్డీలకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధిలో 3 శాతం నుంచి 6 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. యస్ బ్యాంక్ ఇదే కాల పరిమితి ఎఫ్డీలకు 3.25 శాతం నుంచి 7.25 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 రోజుల నుంచి ఒక ఏడాది టైమ్ పిరియడ్ ఎఫ్డీలకు 3 శాతం నుంచి 5.75 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ పౌరులకు 3 శాతం నుంచి 7 శాతం మధ్య వడ్డీ ప్రయోజనాన్ని అందిస్తోంది. కెనరా బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు 4 శాతం నుంచి 6.85 శాతం మధ్య వడ్డీని ఆఫర్ చేస్తోంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల విషయానికి వస్తే.. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు 4.50 శాతం నుంచి 7.85 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇదే కాలపరిమితి ఎఫ్డీలకు 3 శాతం నుంచి 8.50 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి ఒక ఏడాది వరకు ఎఫ్డీలకు 4 శాతం నుంచి 6.85 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
Also Read: Renault Kiger Price: టాటా పంచ్‌తో పోటీ పడుతున్న Renault Kiger.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి