Flipkart Dussehra Sale 2022: దసరాకు కొత్త టీవీ, స్మార్ట్ ఫోన్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్స్.. 75-80 శాతం డిస్కౌంట్

Flipkart Big Dussehra Sale 2022 Dates: భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌తో ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 వచ్చేస్తోంది. మొన్నటి వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022  పేరుతో ఆన్‌లైన్ షాపింగ్‌లో ఆఫర్స్ కుమ్మరించిన ఫ్లిప్‌కార్ట్ సంస్థ తాజాగా దసరా పండగను కూడా క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యింది.

Written by - Pavan | Last Updated : Oct 3, 2022, 04:04 AM IST
Flipkart Dussehra Sale 2022: దసరాకు కొత్త టీవీ, స్మార్ట్ ఫోన్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్స్.. 75-80 శాతం డిస్కౌంట్

Flipkart Big Dussehra Sale 2022 Dates: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 లో భాగంగా కస్టమర్స్‌కి స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్‌టాప్, స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్, కంప్యూటర్ యాసెసరిస్ వంటి వివిధ రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టీవీలు, ఫ్రిడ్జిలు, వాషింగ్ మెషిన్స్ లాంటి కన్సూమర్ డ్యూరబుల్ గూడ్స్, హోమ్ అప్లయెన్సెస్‌తో పాటు అన్ని ఇతర రకాల ఉత్పత్తులపై పెద్ద మొత్తంలో ఆఫర్స్ అందించి ఈ దసరా సీజన్‌లో సందడి చేసేందుకు తయారైంది.

ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 కస్టమర్స్‌కి అందుబాటులో ఉండనుంది. అంతేకాదు.. ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి ఒక రోజు ముందుగానే ఈ సేల్‌లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. అంటే అక్టోబర్ 4వ తేదీ నుంచే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉన్న వాళ్లకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 ని ఎంజాయ్ చేయొచ్చన్న మాట.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 లో కొనుగోలు చేసే వారు హెచ్ డీ ఎఫ్ సీ క్రెడిట్ కార్డు ఉపయోగించే ఈఎంఐ పద్ధతిలో వస్తుసామాగ్రి, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేసినట్టయితే.. వారికి 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్. అంతేకాకుండా 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందే అవకాశం ఉందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. 

75 శాతం నుండి 80 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్స్
జీ బిజినెస్ న్యూస్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 లో కొన్నిరకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్, అలాగే టీవీలతో పాటు ఇతర హోమ్ అప్లయెన్సెస్‌పై 75 శాతం డిస్కోంట్స్ ఇచ్చేలా ఫ్లిప్‌కార్ట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే.. కస్టమర్స్‌కి పంట పండినట్టే అని ఫ్లిప్‌కార్ట్ యూజర్స్ అభిప్రాయపడుతున్నారు.

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సెప్టెంబర్ 23 నుంచి 30 వ తేదీ వరకు వారం రోజుల పాటు కొనసాగింది. చాలామంది కస్టమర్స్ ఈ సేల్ లో తమకు నచ్చిన, తాము మెచ్చిన ఉత్పత్తులు కొనుగోలు చేశారు. అయితే, ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మిస్ అయినా వర్రీ కావాల్సిన అవసరం లేదంటోంది ఫ్లిప్ కార్ట్. అందుకు కారణం త్వరలోనే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 ప్రారంభం కానుండటమే.

Also Read : 5G smartphones: దేశంలో ఇక 5G సేవలు.. చీప్ అండ్ బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్ ఇదిగో

Also Read : iPhone in Rs 20,000: ఐఫోన్ ప్రియులకు బంపరాఫర్.. రూ 20 వేలకే కొత్త ఐఫోన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News