Sreeleela Video: తప్పుడు ప్రచారం.. ఫేక్‌ న్యూస్‌పై శ్రీలీల మాస్‌ వార్నింగ్‌

Sreeleela Mass Warns On Fake News: సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న తప్పుడు వార్తలు.. అసత్య కథనాలపై కిస్సిక్‌ హీరోయిన్‌ శ్రీలీల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 30, 2024, 10:13 PM IST
Sreeleela Video: తప్పుడు ప్రచారం.. ఫేక్‌ న్యూస్‌పై శ్రీలీల మాస్‌ వార్నింగ్‌

 Sreeleela Warning: సమాజంలో జరుగుతున్న పరిణామాలపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. తెలంగాణ మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్‌ రహిత తెలంగాణ సాధన కోసం కృషి చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫేక్‌ న్యూస్‌.. అసత్య ప్రచారాలు.. డీప్‌ ఫేక్‌ వంటి అంశాలపై యుద్ధం ప్రకటించింది. ఈ అంశాలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సినీ తరాలతో అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలోనే కిస్సిక్‌ పిల్ల శ్రీలీల అసత్య వార్తలపై వీడియో చేసింది. తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Also Read: Allu Arjun Bouncers: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై బౌన్సర్ల సంఘం సంచలన ప్రకటన

తప్పుడు వార్తలు.. అసత్య కథనాలపై అవగాహన కల్పిస్తూ శ్రీలీల సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు. 'సోషల్‌ మీడియాలో లైక్స్‌.. వ్యూస్‌.. రీచ్‌ కోసం తప్పుడు వార్తలు చేయకండి. సోషల్‌ మీడియాన మన మంచి కోసం వాడుదాం. వ్యూస్‌ కోసం ఇంకొకరిని న్యూస్‌ చేయకండి' అని శ్రీలీల విజ్ఞప్తి చేసింది. 'అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం. సామాజిక బాధ్యత వహిద్దాం' అంటూ శ్రీలీల పిలుపునిచ్చింది. అసత్య ప్రచారాలకు.. దూషణలకు స్వస్తి పలుకుదాం అని ఏపీ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా శ్రీలీలతోపాటు అడివి శేష్‌, నిఖిల్‌ సిద్ధార్థ్‌ అవగాహన కల్పిస్తూ వీడియోలు విడుదల చేశారు.

Also Read: Bandi Sanjay: 'రేవంత్‌ రెడ్డిలో పవన్‌ కల్యాణ్‌కు ఏం కనిపించిందో?' కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 ది రూల్‌ సినిమాలో 'కిస్సిక్‌' ఐటమ్‌ పాటకు డ్యాన్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఒక్క పాటకు అల్లు అర్జున్‌తో స్టెప్పులు వేయడంతో యావత్‌ ప్రపంచవ్యాప్తంగా శ్రీలీల పరిచయమైంది. ఇప్పుడు హీరోయిన్‌గా అన్ని పరిశ్రమల వారు శ్రీలీలను తీసుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం రెండు, మూడు సినిమాలతో శ్రీలీల బిజీగా ఉంది. ఇక నెట్టింట్లో తన ఫొటోలు, వీడియోలతో శ్రీలీల హల్‌చల్‌ చేస్తోంది. ఆమె హాట్‌ హాట్‌ ఫొటోలు కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News