BSNL Plans: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్‌లు..మీ కోసమే..!

BSNL Plans: భారత టెలికాం రంగంలో ఉండే పోటీ ఎక్కడ ఉండదు. టెలికాం సంస్థలు పోటీ మరి వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. ప్రైవేటు కంపెనీల హవాను తట్టుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా వినియోగదారుల కోసం అధిక డేటాతో కూడిన దీర్ఘకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2022, 06:09 PM IST
  • సరికొత్త ప్లాన్‌లను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్
  • అధిక రోజుల వ్యాలిడిటీ పొందేలా ప్లాన్
  • ఆసక్తి చూపుతున్న వినియోగదారులు
BSNL Plans: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్‌లు..మీ కోసమే..!

BSNL Plans: భారత టెలికాం రంగంలో ఉండే పోటీ ఎక్కడ ఉండదు. టెలికాం సంస్థలు పోటీ మరి వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. ప్రైవేటు కంపెనీల హవాను తట్టుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా వినియోగదారుల కోసం అధిక డేటాతో కూడిన దీర్ఘకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటించింది.

భారత ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. 399 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తోపాటు రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 80 రోజులుగా ఉంది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, లోక్‌ధన్ కంటెంట్‌ను ఉచితంగా పొందేందుకు అవకాశం కల్పించారు. 429 ప్లాన్‌తో రోజుకు వన్‌ జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. దీని వ్యాలిడీటీ 81 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్ వల్ల ఈరోస్‌నౌ ఎంటర్‌టైన్ మెంట్ సేవలను అనుమతి పొందే అవకాశం ఉందని బీఎస్‌ఎన్‌ఎల్ స్పష్టం చేసింది. 

447 రూపాయల ప్లాన్‌తో 100 జీబీ హైస్పీడ్ నెట్‌ను పొందవచ్చు. దీని వ్యాలిడీటీ 60 రోజులు ఉంటుంది. పరిమితి ముగిసినా 80 కేబీపీఎస్‌తో ఉచితంగా ఇంటర్నెట్‌ వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ను డేటా వోచర్‌గా ఉన్నప్పటికీ ..అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఈ ప్లాన్ వల్ల బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు ఉంటాయి. 

రూ.499 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది. వంద ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. 90 రోజుల వ్యాలిడీటీతో ఈ ప్లాన్‌ ఉంది. దీని వల్ల ఎలాంటి ఓటీటీ సభ్యత్వం రాదని సదురు సంస్థ వెల్లడించింది. రూ.1498 ప్లాన్ పూర్తిగా డేటా వోచర్‌గా ఉండనుంది. ఈ ప్లాన్‌తో కేవలం డేటా మాత్రమే వినియోగించుకోవచ్చు. మిగిలిన ఏ ప్రయోజనాలు పొందలేరు. రోజుకు 2 జీబీ డేటాను 365 రోజులపాటు పొందే అవకాశం ఉంటుంది. 

ఇక 599 రూపాయల ప్లాన్ వర్క్ ఫ్రమ్ హోం ప్యాకేజీగా ఉంది. రోజుకు 5 జీబీ డేటాను 84 రోజులపాటు వినియోగించుకోవచ్చు. పరిమితి దాటినా 80 కేబీపీఎస్ వేగంతో నెట్‌ను వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు. జింగ్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా చూడవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది.

 

Also read:Shami Plant In Vastu: శమీ మొక్క నాటితే అన్నీ శూభలే..ఏ దిశలో నాటాలో తెలుసుకోండి

Also read:Do Not Google It: ఇకపై గూగుల్ లో వీటి గురించి సెర్చ్ చేస్తే జైలుశిక్ష తప్పదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News