Metro vs Rapid Rail: ర్యాపిడ్ రైలంటే ఏంటి, మెట్రోకు ర్యాపిడ్ రైలుకు ఉన్న అంతరమేంటి

Metro vs Rapid Rail: దేశంలో ఇప్పుడు కొత్తగా ర్యాపిడ్ రైల్ మాట విన్పిస్తోంది. ర్యాపిడ్ రైలంటే మెట్రో రైలు లాంటిదేనా. రెండింటికీ తేడా ఏమైనా ఉందా లేదా. అసలు ర్యాపిడ్ రైలు అంటే ఏంటి, ర్యాపిడ్ రైలుతో కలిగే ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2023, 09:52 PM IST
Metro vs Rapid Rail: ర్యాపిడ్ రైలంటే ఏంటి, మెట్రోకు ర్యాపిడ్ రైలుకు ఉన్న అంతరమేంటి

Metro vs Rapid Rail: ర్యాపిడ్ రైలు అంటే ఢిల్లీ మెట్రో రైలు లాంటిదేననేది చాలామంది అభిప్రాయం. కానీ ఇది వాస్తవం కాదు. ర్యాపిడ్ రైలుకు, మెట్రోకు చాలా తేడా ఉంది. ఢిల్లీ నుంచి మీరట్ మధ్య త్వరలో ప్రారంభం కానున్న ర్యాపిడ్ రైలు చూస్తే రెండింటికీ మధ్య అంతరం ఏంటనేది తెలుస్తుంది. ఆ వివరాలు మీ కోసం..

దేశంలో తొలి ర్యాపిడ్ రైలు ఢిల్లీ-మీరట్ మధ్య త్వరలో ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి మీరట్ మధ్య దూరం చేరేందుకు ర్యాపిడ్ రైలు ద్వారా పెద్దగా సమయం పట్టదు. ర్యాపిడ్ రైలు ప్రయాణం ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా సమయం చాలావరకూ సేవ్ అవుతుంది. ర్యాపిడ్ రైలంటే ఢిల్లీ మెట్రో రైలు లాంటిది కానేకాదు. ర్యాపిడ్ రైలులో లగ్జరీ సౌకర్యాలు చాలా ఉన్నాయి. ఇవి ఢిల్లీ మెట్రోలో లేవు. అయితే ర్యాపిడ్ రైలు ఢిల్లీ మెట్రో రూట్‌తోనే అనుసంధానమౌతుంది. మెట్రోలో మొదటి కోచ్ మహిళలకు ఏ విధంగా రిజర్వ్ అవుతుందో..అదే విధంగా ర్యాపిడ్ రైలులో తొలి కోచ్ మహిళలకు కేటాయిస్తారు. 

ర్యాపిడ్ రైలుకు మెట్రో రైలుకు తేడా ఏంటి

ర్యాపిడ్ రైలుకు, మెట్రో రైలుకు తేడా చాలానే ఉంది. ముఖ్యంగా ఈ రెండింటి వేగంతో తేడా ఎక్కువగా ఉంది. ఢిల్లీ మెట్రో సరాసరి వేగం గంటకు 80 కిలోమీటర్లు కాగా ర్యాపిడ్ రైలు సరాసరి వేగం గంటకు 140-160 కిలోమీటర్లు ఉంటుంది. ర్యాపిడ్ రైలు ప్రయాణం చేసేందుకు ఆర్ఆర్ టీఎస్ క్యూఆర్ కోడ్ ఆధారిత పేపర్ టికెట్ ఇస్తారు. ర్యాపిడ్ రైలు చూసేందుకు బుల్లెట్ రైలు ఆకారం కలిగి ఉంటుంది. మూలల్నించి చూస్తే మాత్రం మెట్రోను పోలి ఉంటుంది. ర్యాపిడ్ రైలులో కూర్చునేందుకు రెండు వరుసల్లో సీట్లు ఉంటాయి. ర్యాపిడ్ రైలులో స్టేషన్లు ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. మెట్రోకు ఉన్నట్టు పక్కపక్కనే ఉండవు. ర్యాపిడ్ రైలులో ఫ్రీ వైఫై, ఛార్జింగ్ సౌకర్యం, ఇన్‌‌ఫోటైన్‌మెంట్ ఉంటాయి.

గమ్యస్థానం చేరుకున్న తరువాత డోర్స్ ఓపెన్ చేసేందుకు పుష్ బటన్ ఏర్పాటు ఉంటుంది. ప్రతి డోర్ స్టేషన్ రాగానే ఓపెన్ కాదు. ర్యాపిడ్ రైలులో ప్రతి కోచ్‌లో 10 సీట్లు మహిళలకు కేటాయించి ఉండటం విశేషం. ర్యాపిడ్ రైలు వ్యవస్థ ప్రారంభమైతే రోడ్ ట్రాఫిక్ చాలావరకూ తగ్గవచ్చని అంచనా. అంతేకాకుండా తక్కువ ధరకే సునిశ్చిత ప్రయాణం పొందవచ్చు. రోడ్డు ప్రయాణంతో పోలిస్తే చాలా ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్, టైమ్ సేవింగ్, కాలుష్యం నుంచి రక్షణ ఇలా చాలానే ఉంటాయి. ర్యాపిడ్ రైలు వ్యవస్థ ద్వారా రోజుకు 80 వేల మంది ప్రయాణం చేయవచ్చని అంచనా.

Also read: Pan Card Updates: మీ పాన్ కార్డు దుర్వినియోగమైందో లేదో ఎలా తెలుసుకోవడం, ఏం చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News