Diamond Gold Umbrella: ఆ గొడుగు ఖరీదు ఎంతో తెలిస్తే...నోరెళ్లబెట్టాల్సిందే

Diamond Gold Umbrella: వజ్రాల వ్యాపారమంటే ఇండియానే. అందులోనూ గుజరాత్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం. అత్యద్భుతమైన కళ్లు చెదిరే వజ్రాల గొడుగుతో ఆ ప్రత్యేకతను మరోసారి నిలుకుంది. అదేంటో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 1, 2021, 11:19 AM IST
Diamond Gold Umbrella: ఆ గొడుగు ఖరీదు ఎంతో తెలిస్తే...నోరెళ్లబెట్టాల్సిందే

Diamond Gold Umbrella: వజ్రాల వ్యాపారమంటే ఇండియానే. అందులోనూ గుజరాత్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం. అత్యద్భుతమైన కళ్లు చెదిరే వజ్రాల గొడుగుతో ఆ ప్రత్యేకతను మరోసారి నిలుకుంది. అదేంటో చూద్దాం.

ఆ చిన్ని గొడుగు ధర 25 నుంచి 30 లక్షల రూపాయలు. నమ్మలేకున్నా ఇది ముమ్మాటికీ నిజం. డైమండ్ మార్కెట్ దీని ధర అంతే. గొడుగని చెప్పి..డైమండ్ మార్కెట్ ధర చెబుతున్నారేంటని ఆశ్చర్యపోతున్నారా. ఇది డైమండ్స్ పొదిగిన అనే కంటే డైమండ్స్‌తో చేసిన ఓ ప్రత్యేకమైన గొడుగు. జేమ్స్ అండ్ జ్యువెల్లరీ అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారులు తయారు చేసిన ఈ ప్రత్యేక డిజైన్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ ఎగ్జిబిషన్ సందర్శించి మహిళల్ని వజ్రాల గొడుగు చాలా ఆకర్షిస్తోంది. 

ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో సూరత్‌కు ప్రత్యేకస్థానం ఎప్పుడూ ఉంటుంది. అందులో వజ్రాల వ్యాపారంలో మరీనూ. సూరత్ వజ్రాల వ్యాపారుల చేసిన ఈ ప్రత్యేకమైన గొడుగు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ డైమండ్ గొడుగును చేత్న మంగూకియా డిజైన్ చేశాడు. 175 క్యారెట్ల డైమండ్ ఈ గొడుగులో అమర్చారు. 12 వేల వజ్రాలు, 450 గ్రాముల బంగారంతో ఈ గొడుకు తయారైంది. 25-30 మంది వర్కర్లు 2 రోజులపాటు తయారు చేశారు. అమెరికా, యూరప్, హాంకాంగ్ వంటి దేశాల్నించి అప్పుడే ఆర్డర్లు కూడా వస్తున్నాయని సూరత్ వజ్రాల వ్యాపారి చెబుతున్నాడు. అందుకే ఈ వజ్రాల గొడుగు ధర 25-30 లక్షలుంటోందని అంచనా.

Also read: Gold Price Today: మరోసారి తగ్గిన బంగారం, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News