Edible Oil Prices: అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల తగ్గుదల, ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోవడంతో దేశీయ రిటైల్ మార్కెట్‌లో వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ నెల ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా వేరు శెనగ నూనె మినహా ప్యాకేజ్డ్ వంట నూనెల ధరలు కొద్ది మేర తగ్గుముఖం పట్టాయి. పస్తుతం కిలో వంట నూనెల ధర రూ.150-రూ.190 మధ్య ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో గోధుమలు, గోధుమ పిండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయని తెలిపారు. పలు ప్రధాన బ్రాండ్స్‌కి చెందిన వంట నూనెల ధరలు దశలవారీగా ఎమ్మార్పీని తగ్గించాయన్నారు.
గత వారం అదానీ విల్మార్, మదర్ డెయిరీ వివిధ రకాల వంట నూనెల(గరిష్ట రిటైల్ ధర) ధరను లీటరుకు రూ.10-రూ.15 మేర తగ్గించాయి. కొత్త ఎమ్మార్పీతో కూడిన స్టాక్ త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని తెలిపాయి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం జూన్ 1న కిలో వేరు శెనగ నూనె (ప్యాకెజ్డ్) ధర రూ.186.43గా ఉండగా.. జూన్ 21న అది రూ.188.14కి చేరింది.జూన్ 1న కిలో రూ.183.68గా ఉన్న ఆవాల నూనె ధర జూన్ 21న రూ.180.85కి తగ్గింది.వనస్పతి ధర కిలో రూ.165 వద్ద స్థిరంగా ఉంది. సోయా నూనె ధర రూ.169.65 నుంచి రూ.167.67కి స్వల్పంగా తగ్గగా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర కిలో రూ.193 నుంచి 189.99కి స్వల్పంగా తగ్గింది. జూన్ 1న కిలో రూ.156.4గా ఉన్న పామాయిల్ ధర జూన్ 21న రూ.152.52కి తగ్గింది.
అదానీ విల్మార్ కంపెనీ శనివారం (జూన్ 18) వంట నూనెల ధరలను లీటరుకు రూ.10 మేర తగ్గించింది. ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాక్ ధర రూ.220 నుంచి రూ.210కి తగ్గించబడింది. ఫార్చ్యూన్ సోయాబీన్, ఫార్చ్యూన్ మస్టర్డ్ ఆయిల్ ధర లీటరుకు రూ.205 నుంచి రూ.195కి తగ్గింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ప్రముఖ పాల సరఫరాదారులలో ఒకటైన మదర్ డెయిరీ తమ వంట నూనెల ఉత్పత్తులను లీటరుకు రూ.15 మేర తగ్గించింది. మస్టర్డ్ ఆయిల్ ధరను లీటర్‌పై రూ.208 నుంచి రూ.193కి తగ్గించింది. రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ (1 లీటర్ పాలీ ప్యాక్) లీటర్ ధర గతంలో రూ.235 ఉండగా ఇప్పుడు రూ.220కి తగ్గించబడింది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ (1 లీటర్ పాలీ ప్యాక్) ధర రూ.209 నుంచి రూ.194కి తగ్గింది. మదర్ డెయిరీ సంస్థ తమ వంట నూనెల ఉత్పత్తులను ధారా బ్రాండ్‌తో విక్రయిస్తోంది.
భారత్‌లో వంట నూనెల దిగుమతి 2020-2021 సంవత్సరంలో 131.3 లక్షల టన్నులుగా ఉంది. అయితే విలువ పరంగా, ఇన్‌వర్డ్ షిప్‌మెంట్ 63 శాతం పెరిగి రూ.1.17 లక్షల కోట్లను నమోదు చేసినట్లు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) వెల్లడించింది. 2021-22 సంవత్సరంలో మొదటి ఏడు నెలల కాలానికి వెజిటేబుల్ ఆయిల్స్ (ఎడిబుల్, నాన్ ఎడిబుల్) దిగుమతి 1శాతం పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 76,77,998 టన్నులుగా ఉండగా.. 2021-22లో ఇది 77,68,990 టన్నులుగా ఉంది.
Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ ఆఫర్.. రూ.1000కే POCO M4 Pro మొబైల్ మీ సొంతం! లిమిటెడ్ ఆఫర్
Also Read: Ram Pothineni Sorry To Lingusamy: అసలు విషయం మర్చిపోయా.. క్షమించమంటూ ట్వీట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook