Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్ ఆఫర్.. రూ.1000కే POCO M4 Pro మొబైల్ మీ సొంతం! లిమిటెడ్ ఆఫర్

POCO M4 Pro smart phone Flipkart Offer. రూ. 17,999 విలువ చేసే పోకో ఎమ్ 4 ప్రోపై ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 23, 2022, 02:08 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్
  • పోకో ఎమ్ 4 ప్రోపై భారీ తగ్గింపు
  • ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో రూ.1000లకే ఫోన్
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్ ఆఫర్.. రూ.1000కే POCO M4 Pro మొబైల్ మీ సొంతం! లిమిటెడ్ ఆఫర్

POCO M4 Pro smart phone Flipkart Offer: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. పోకో ఎమ్ 4 ప్రో (POCO M4 Pro Power Black, 64 GB, 6 GB RAM) స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 1000కే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఇంత తక్కువ ధరకే పోకో M4 ప్రో కొనుగోలు చేసే అవకాశం ఉంది. పోకో M4 ప్రో 64 GB, 6 GB RAM వేరియంట్ మార్కెట్ ధర రూ.17,999 కాగా.. కేవలం ఒక వెయ్యితో మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. 

పొకొ ఎమ్ 4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో రూ. 17,999 ధరకు విక్రయిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ 30 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అంటే రూ. 5500 వేల తగ్గింపుతో.. పొకొ ఎమ్ 4 ప్రో మొబైల్ రూ. 12,499 లకు మీకు లభిస్తుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు పోకో ఎమ్ 4 ప్రో (Cool Blue, 128 GB, 8 GB RAM) వేరియంట్ 30 శాతం డిస్కౌంట్ అనంతరం రూ. 15,499లకు లభిస్తుంది. 

పొకొ ఎమ్ 4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు సమయంలో ఎస్‌బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించడం వల్ల రూ. 1000 తగ్గింపు పొందవచ్చు. దీంతో పోకో M4 ప్రో 64 GB, 6 GB RAM వేరియంట్ రూ. 11,449లకు మీకు అందుబాటులో ఉంటుంది. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా గరిష్టంగా రూ. 11,499 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత మొబైల్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. మీ మొబైల్ కండిషన్‌ బాగుండి పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే.. పొకొ ఎమ్ 4 ప్రోని రూ. 1000కే సొంతం చేసుకోవచ్చు. 

పోకో ఎం4 ప్రో స్పెసిఫికేషన్లు:
# 6.43 ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే 
# మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌ 
#  64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా (64+2+8)
#16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెెమెరా
# 5000ఎంఏహెచ్ బ్యాటరీ 

Also Read: Jos Buttler Six: అంతకుమించి సిక్స్.. బంతి పిచ్ బయటపడినా వదలని జోస్ బట్లర్‌! (వీడియో)

Also Read: Maharashtra Political Crisis: కొనసాగుతున్న 'మహా' డ్రామా..ఏక్‌నాథ్‌ శిందే వైపు ఎమ్మెల్యేల క్యూ..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News