EPF Interest Rate: ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పెరిగిన వడ్డీ రేటు

EPF Interest Rate for FY 2022-23: ఈపీఎఫ్‌ వడ్డీ రేటు పెంపుదలకు కేంద్ర ఆమోద ముద్ర వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటు అందనుంది. దీంతో ఐదు కోట్ల ఈపీఎఫ్‌ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 24, 2023, 02:02 PM IST
EPF Interest Rate: ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పెరిగిన వడ్డీ రేటు

EPF Interest Rate for FY 2022-23: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును 8.15 శాతంగా ప్రకటించింది. మార్చి 28న 8.15 శాతం వడ్డీ రేటును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించగా.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సోమవారం సర్క్యులర్ జారీ చేసింది. 

మార్చి 28న ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT)ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్‌పై 8.15 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. గతంలో 8.10 శాతం ఉండగా.. వడ్డీ రేటును 0.05 శాతం పెంచారు. ఈ ప్రతిపానను కేంద్ర ప్రభుత్వానికి పంపించగా.. తాజాగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కేంద్ర నిర్ణయంతో 5 కోట్లకు పైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. గత ఆర్థిక సంవత్సరానికి అతి తక్కువగా 8.1 శాతం వడ్డీ ప్రకటించగా.. ఈసారి కూడా తగ్గిస్తుందని అందరూ భావించారు. అయితే ఈపీఎఫ్ ఖాతాదారుల గుడ్‌న్యూస్ అందిస్తూ.. 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచింది.

 

ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతం నుంచి ఈపీఎఫ్ ఖాతాకు నెల వారీ ప్రతిపాదికన 12 శాతం జమ అవుతుంది. కంపెనీ యజమాన్యం కూడా 12 శాతం ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఇందులో 3.67 శాతం మాత్రమే ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుండగా.. మిగిలిన 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్‌)కి వెళుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వం ఆమోదించిన తర్వాత మాత్రమే ఈపీఎఫ్‌ఓ ​​వడ్డీ రేటును అందిస్తుంది.ఈపీఎఫ్‌ ​​ఫీల్డ్ ఆఫీసులు వడ్డీని చందాదారుల ఖాతాలకు జమ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి. 

ఈ మార్గాల్లో ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోండి. 
==> ఉమాంగ్ యాప్‌ని ఉపయోగించడం ద్వారా..
==> ఇ-సేవా పోర్టల్‌ని సందర్శించడం ద్వారా..
==> మిస్డ్ కాల్ ద్వారా
==> ఎస్‌ఎంఎస్ ద్వారా

మార్చి 2022లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును 2020-21లో 8.5 శాతం నుంచి నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.10 శాతానికి తగ్గించింది. ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8 శాతంగా ఉన్న 1977-78 తర్వాత ఇది అతి తక్కువ. 2018–19 ఆర్థిక సంవత్సరానికి అందించిన 8.65 శాతం నుంచి 2019–20కి ఏడేళ్ల కనిష్టానికి 8.5 శాతానికి తగ్గించింది. 2016–17లో 8.65 శాతం, 2017–18లో 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. 2015-16లో వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా 8.8 శాతంగా ఉంది. 2013-14, 2014-15లో 8.75 శాతం వడ్డీని ఇచ్చింది. ఇది 2012-13కి 8.5 శాతం కంటే ఎక్కువ. 2011-12లో వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది.

Also Read: Bank Holiday August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..!  

Also Read: CM Jagan Mohan Reddy: రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకతంగా నిలిచిపోయే రోజు: సీఎం జగన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News