EPS 95 Pension: ఈపీఎస్ పెన్షన్-95 పింఛన్ దార్లకు త్వరలో గుడ్ న్యూస్.. మినిమం పెన్షన్ రూ. 7500 పక్కా

EPS 95 Pension Scheme: సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఈపీఎస్ 95 హయ్యర్ పెన్షన్ డిమాండ్ పై దేశవ్యాప్తంగా ఉన్న పెన్షన్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 25వ తేదీన కూడా హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని ఈపీఎస్ 95 పెన్షన్ దారుల సంఘం డిమాండ్ చేస్తుంది.

Written by - Bhoomi | Last Updated : Aug 23, 2024, 08:45 PM IST
EPS 95 Pension: ఈపీఎస్ పెన్షన్-95 పింఛన్ దార్లకు  త్వరలో గుడ్ న్యూస్.. మినిమం పెన్షన్ రూ. 7500 పక్కా

EPS 95 Pension Scheme:  సదీర్ఘ కాలంగా హైయర్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న  ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు త్వరలోనే గుడ్ న్యూస్ లభించనుంది.  ఆగస్టు 25వ తేదీ ఆదివారం  ఉత్తర ప్రదేశ్ లోని ఫిలిబిత్ పట్టణంలోని రోడ్‌వేస్ బస్టాండ్‌లో EPS 95 రాష్ట్రీయ సంఘర్ష్ కమిటీ పెన్షన్ సంబంధిత సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఉన్న  ప్రభుత్వ, సహకార రంగానికి చెందిన వారు హాజరవుతారని గంగా ప్రసాద్ లోధి, మాజీ కార్మిక సంక్షేమ  ఎల్‌హెచ్ షుగర్ మిల్ చిరంజీవ్ గౌర్ తెలిపారు.

అయితే పెన్షన్ హోల్డర్స్ ఆర్గనైజేషన్ EPS-95 నేషనల్ మూవ్‌మెంట్ కమిటీ (NAC) సభ్యులు ఈ సందర్భంగా  మాట్లాడుతూ హయ్యర్  పెన్షన్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర  ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు.. EPS-95 స్కీమ్‌లోని దాదాపు 78 లక్షల మంది పెన్షనర్లు కనీస నెలవారీ పెన్షన్‌ను 7,500 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియాను తమ ప్రతినిధులను కలిశారని పెన్షనర్ల సంఘం తెలిపింది. పెన్షనర్ల డిమాండ్‌ను నెరవేర్చడానికి  కేంద్ర  ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని కార్మిక మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు సంఘం తెలిపింది.

Also Read : Digital PAN Card: రెండు గంటల్లోనే డిజిటల్ పాన్ కార్డు.. పొందడి ఇలా

ప్రస్తుతం ఈపీఎస్ 95 పెన్షన్ దారుల నెలవారీ సగటు పెన్షన్ రూ.1,450 మాత్రమే:

ఈ వారం దేశ రాజధానిలో EPS-95 NAC సభ్యులు నిర్వహించిన నిరసన అనంతరం సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సభ్యులు ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన తెలిపారు. సగటు నెలవారీ పెన్షన్ రూ. 1,450 మాత్రమే కాకుండా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు 36 లక్షల మంది పింఛన్‌దారులు నెలకు రూ.1,000 లోపు పెన్షన్‌ పొందుతున్నారని ఆ సంస్థ తెలిపింది.

పెన్షన్ దారుల జీవితం కూడా కష్టంగా మారుతోంది:

కమిటీ చైర్మన్ అశోక్ రౌత్ మాట్లాడుతూ మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సీరియస్‌గా ఉందని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య హామీ ఇచ్చారని తెలిపారు. మన సమస్యల పరిష్కారానికి ప్రధాని కూడా కట్టుబడి ఉన్నారని అన్నారు. సాధారణ పెన్షన్ ఫండ్‌కు దీర్ఘకాలిక కాంట్రిబ్యూషన్ చేసినప్పటికీ పెన్షనర్లు చాలా తక్కువ పెన్షన్‌ను పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇస్తున్న పింఛను కారణంగా వృద్ధ పెన్షనర్ల  జీవనం కూడా కష్టతరంగా మారిందన్నారు

నెలకు రూ.7,500 డిమాండ్:

EPS-95 NAC కనీస పెన్షన్‌ను నెలకు రూ. 7,500కి పెంచాలని డిమాండ్ చేసిందని, ఇందులో పెన్షనర్ జీవిత భాగస్వామికి డియర్‌నెస్ అలవెన్స్  ఉచిత ఆరోగ్య సదుపాయాలు ఉండాలని రౌత్ చెప్పారు. కాంగ్రెస్  సహా  ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు కూడా సంస్థ సభ్యులను కలిశారని, హయ్యర్ పెన్షన్ డిమాండ్‌ను నెరవేర్చడంలో ప్రతిపక్షాల మద్దతు ఉంటుందని రౌత్ తెలిపారు.

Also Read : Gold Rate Today : శుక్రవారం పూట మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News