Kotak Mahindra Bank Hikes FD Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును పెంచిన తరువాత అన్ని బ్యాంక్‌లు తమ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ)వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన టేనర్‌ల వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచినట్లు వెల్లడించింది. కొత్తగా పెరిగిన వడ్డీ రేట్లు మార్చి 8వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.
సవరించిన ఎఫ్‌డీ వడ్డీ రేటు తరువాత.. సాధారణ పెట్టుబడిదారులు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 2.75 శాతం నుంచి 6.20 శాతం వరకు వడ్డీ రేట్లను పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు 3.25% నుంచి 6.70% వరకు రేట్లు పొందవచ్చు. ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు గరిష్టంగా 7.20 శాతం వడ్డీ రేటును, 390 రోజుల (12 నెలల 24 రోజులు) నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధిలో 7.70 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
తాజా ఎఫ్‌డీ రేట్లు 7-14 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీ రేటును, 15-30 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తామని కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. బ్యాంకు 31-45 రోజుల పాటు డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీ రేటును, 46-90 రోజుల వరకు డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అయితే 91-120 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు 4 శాతం వడ్డీ రేటు ఆఫర్ ఉంది. 121-179 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు 4.25 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది.
180 రోజుల్లో మెచ్యూర్ అయ్యే దేశీయ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు 6 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. అయితే 181 రోజుల నుంచి 363 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటికి 6 శాతం వడ్డీ రేటు ఉంటుంది. బ్యాంకు 364 రోజుల పాటు డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేటును, 365 రోజుల నుంచి 389 రోజుల వరకు డిపాజిట్లపై 7% వడ్డీ రేటు కంటిన్యూ అవుతుంది.
Also Read: Ind Vs Aus: సేఫ్ జోన్‌లో ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు.. భారత్ గెలవాలంటే..!
Also Read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి