Financial Tips: ఎక్కువగా కష్టపడొద్దు.. ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలు ఇవిగో..!

How To Earn Extra Income: కొందరికి డబ్బును సంపాదించేందుకు కష్టాలు పడుతుంటే.. మరికొందరు సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులను ఎందుకు వృథా చేస్తారు..? మనం సరైన మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తే.. మనకు డబ్బే డబ్బును సంపాదించిపెడుతుంది. అలాంటి మార్గాలు ఇవిగో..!  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 27, 2023, 06:56 AM IST
Financial Tips: ఎక్కువగా కష్టపడొద్దు.. ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలు ఇవిగో..!

How To Earn Extra Income: ధనం మూలం ఇదం జగత్.. పైసామే పరమాత్మ.. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది డబ్బు. 'డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బారావు గారంటారు..' అంటూ ఎప్పుడో నాగార్జున తన సినిమాలో పాట పాడారు. చేతిలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ దక్కుతోంది. మన బ్యాంక్ బ్యాలెన్స్ నిండుగా ఉంటే.. అనుకున్నది సాధించవచ్చు.. కలలు సాకారం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అంతకంతకు పెరిగిపోతున్న ఖర్చల భారంతో బతుకు బండి లాగడమే చాలామందికి కష్టంగా మారుతోంది. ఇక కలలు సంగతి గురించి అస్సలు ఆలోచించడం లేదు. అదరనపు ఆదాయ మార్గాల కోసం చూస్తున్నారు. మీరు నెల నెల కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుని.. సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేచ్చు. ఇందుకోసం మీకు వివిధ మార్గాలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం కావాలంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మీరు పెట్టుబడి పెట్టిన కంపెనీ లాభాల్లో దూసుకువెళితే.. మీ షేర్ విలువ పెరుగుతుంది. అయితే మార్కెట్‌లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయాలి. షార్ట్ టైమ్ కోసం చూసుకోకూడదు. ఏదైనా ఈక్విటీ తక్కువ ధరకు లభిస్తే వెంటనే దానిని కొనుగోలు చేయాలి. ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్, పెట్టుబడి హోరిజోన్ ఆధారంగా దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించుకోవాలి.

ఎప్పుడు కూడా భావోద్వేగాలపై ఆధారపడి నిర్ణయం తీసుకోకండి. సెంటిమెంట్‌తో నిర్ణయం తీసుకుంటే.. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. ఈక్విటీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి తదితర విభిన్నమైన వాటిలో పెట్టుబడి పెట్టండి. స్వల్పకాలిక మార్కెట్ ఒడిదుడుకులను నివారించండి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా.. మీ పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్ ఆధారంగా మీ పోర్ట్‌ఫోలియోను క్రమం తప్పకుండా సమీక్షించుకుంటూ.. రీబ్యాలెన్స్ చేసుకోండి. 

సమస్యలు, ఆపదలు మీకు ఎప్పుడు ముందే చెప్పిరావు. ఇందుకోసం ఎమర్జెన్సీ ఫండ్‌ను క్రియేట్ చేసుకోవాలి. మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్‌ మిమల్ని ఆదుకుంటుంది. మీ పెట్టుబడులకు అంతరాయం కలగకుండా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోనేందుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి. ప్రతి కుటుంబానికి నెలవారీ అవసరమైన ఖర్చుల ఆధారంగా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. బీమా చేసినా.. ఏదైనా ఆరోగ్య సంబంధిత ఆకస్మిక సందర్భంలో ఈ ఫండ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read: IPL Best Captains: ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్స్ వీళ్లే.. నెంబర్ వన్‌ ప్లేస్‌లో ఎవరంటే..?  

అన్ని పెట్టుబడులు ఆదాయంతోనే కాకుండా భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా కూడా ఉండాలి. ఈక్విటీలో పెట్టుబడి లక్ష్యం వృద్ధి, అధిక రాబడి ఉండాలి. స్థిర ఆదాయ కోసం లిక్విడిటీపై దృష్టి పెట్టాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి వంటి స్థిర ఆదాయ పథకాలలోనూ ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా.. లైఫ్‌ ఇన్సురెన్స్ మాత్రం చేయించడం మర్చిపోకండి. అనుకోని పరిస్థితులు ఎదురైతే బీమా డబ్బులు మీ కుటుంబానికి అండగా ఉంటాయి.

Also Read: Millet Cultivation: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీ..!  

Also Read: Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో నిమ్మకాయలు.. నన్ను బలిస్తారేమో అనుకున్నా: బండి సంజయ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News