IPL Best Captains: ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్స్ వీళ్లే.. నెంబర్ వన్‌ ప్లేస్‌లో ఎవరంటే..?

Most Successful Captains In IPL: ఐపీఎల్ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలను నిరూపించుకునేందుకే కాదు.. నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకునేందుకు మంచి వేదిక. ఐపీఎల్‌ నుంచే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్ల కెప్టెన్సీ నైపుణ్యాలు వెలుగులోకి వచ్చాయి. హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లు ఎవరంటే..?

1 /8

గుజరాత్ టైటాన్స్ జట్టుకు 21 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు హార్దిక్ పాండ్యా. మొత్తం 15 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. 75 శాతం సక్సెస్ రేటుతో ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు.   

2 /8

ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 217 మ్యాచ్‌లలో నాయకత్వం వహించిన ధోనీ.. 128 మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాలు అందించాడు. విజయాల శాతం 58.99 శాతంగా ఉంది.

3 /8

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 51 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించాడు. 58.82 విజయ శాతంతో 30 మ్యాచ్‌లను గెలిపించాడు. 

4 /8

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 43 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించాడు. 58.82 సక్సెస్ రేటుతో 25 మ్యాచ్‌లు విజయాలు అందించాడు.   

5 /8

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 26 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. 15 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. 57.69 శాతం సక్సెస్ రేట్ ఉంది.  

6 /8

వికెట్ కీపర్ రిషబ్ పంత్ 30 మ్యాచ్‌ల్లో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించాడు.  17 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. విజయాల శాతం 56.67గా ఉంది. యాక్సిడెంట్‌ కారణంగా ఈ సీజన్‌లో ఆడటం లేదు. 

7 /8

దివంగత ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 55 మ్యాచ్‌ల్ నాయకత్వం వహించాడు. 56.36 సక్సెస్ రేట్‌తో 31 మ్యాచ్‌ల్లో గెలిపించాడు.   

8 /8

హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ 149 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 83 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. 56.08 సక్సెస్ రేట్ ఉంది.