Fixed Deposit Rates 2023: ఈ బ్యాంకుల కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు

Best Fixed Deposit Rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులు కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పాయి. ఎఫ్‌డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఆర్‌బీఐ రెపోరేటును పెంచిన నేపథ్యంలో అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 04:04 PM IST
Fixed Deposit Rates 2023: ఈ బ్యాంకుల కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు

Best Fixed Deposit Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తరువాత అన్ని బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తున్నాయి. లోన్లు, డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులు తాజాగా ఎఫ్‌డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ మూడు బ్యాంకులు వేర్వేరు పదవీకాలానికి తమ ఎఫ్‌డీ రేట్లను పెంచాలని నిర్ణయించుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్గరూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. ఫెడరల్, కోటక్ మహీంద్రా బ్యాంకులు రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మొత్తానికి వినియోగదారులు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధికంగా 7.75 శాతం వడ్డీ రేటును పొందుతారు. 
 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త రేట్లు ఇలా..

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ.. రూ.2 నుంచి 5 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతున్నట్లు వెల్లడించింది. మొత్తం 25 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు తెలిపింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీలపై వినియోగదారులకు 4.75% నుంచి 7 శాతం వరకు వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం నుంచి 7.75 శాతం వరకు పొందవచ్చు. కొత్త రేట్లు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త రేట్లు ఇలా..

రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేటును పెంచాలని నిర్ణయించింది కోటక్ మహీంద్రా బ్యాంక్. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధిలో సాధారణ కస్టమర్‌లకు 2.75 శాతం నుంచి 6.20 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 6.70 శాతం వరకు వడ్డీ రేట్లు పొందనున్నారు. గరిష్ట వడ్డీని 2 సంవత్సరాల కాలానికి అందిస్తోంది. బ్యాంకు సాధారణ వినియోగదారులకు 7.20 శాతం, సీనియర్‌ సిటిజన్‌లకు 7.70 శాతం వడ్డీ ఇస్తోంది.

ఫెడరల్ బ్యాంక్ కొత్త రేట్లు ఇలా..

ఫెడరల్ బ్యాంక్ కూడా ఎఫ్‌డీల వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించింది. సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి 2223 రోజుల వరకు రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై 3 శాతం నుండి 6.60 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 15 నెలల కాలానికి బ్యాంకు ఖాతాదారులకు గరిష్ట వడ్డీని ఇస్తోంది. సాధారణ వినియోగదారులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. కొత్త రేట్లు ఫిబ్రవరి 17 నుంచి అమలులోకి వచ్చాయి. 

బ్యాంకుల డిపాజిట్ రేట్లు ఆర్‌బీఐ రెపో రేటుపై ఆధారపడి ఉంటాయి. గతేడాది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు.. సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మొత్తం 2.50 శాతం పెంచింది. అలా పెంచుతూ ప్రస్తుతం 6.50 శాతానికి చేరింది. రెపో రేటులో నిరంతర పెరుగుదల కారణంగా.. అన్ని బ్యాంకులు తమ సేవింగ్స్ అకౌంట్, ఎఫ్‌డీ, ఆర్‌డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతోపాటు బ్యాంకులు తమ లోన్లపై వడ్డీని కూడా పెంచుతున్నాయి. దీంతో ప్రజలపై ఈఎంఐల భారం పడుతోంది.

Also Read: MLA Sayanna Passed Away: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనంజా.. ఒకేసారి భారీగా నగదు జమ   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News