Flipkart Smart TV Offers: ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ మరోసారి 'ఎలక్ట్రానిక్ సేల్ ఆఫర్' ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై ఈ ఆఫర్‌లో భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. బ్రాండ్ స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ ఫేవరెట్ బ్రాండ్స్‌ను చౌక ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్ టీవీల్లో ఎల్‌జీ 80 సెం.మీ (32 అంగుళాలు) హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని ఎలక్ట్రానిక్ సేల్‌లో అతిచౌక ధరకే కొనుగోలు చేయవచ్చు.
27 శాతం డిస్కౌంట్ :
ఎల్‌జీ 80 సెం.మీ (32 అంగుళాలు) హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ లాంచింగ్ ధర రూ.21,990. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 27 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్‌తో దాదాపు రూ.6 వేలు వరకు ఆదా అవుతుంది. తద్వారా రూ.15,999కే మీరు ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మరింత చౌకగా రూ.14,499కే ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.
ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో రూ.11,500 తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఎల్‌జీ 80 సెం.మీ (32 అంగుళాలు) స్మార్ట్ టీవీపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత టీవిని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.11,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఎక్స్‌చేంజ్ ద్వారా మీకు లభించే తగ్గింపు పూర్తిగా మీ టీవీ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. ఒకవేళ పూర్తి ఆఫర్ లభించినట్లయితే రూ.15,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవిని కేవలం రూ.4,999కే పొందవచ్చు. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 14 నుంచి జూలై 18 వరకు మాత్రమే ఎలక్ట్రానిక్ సేల్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే జూలై 18 లోపే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.
Also Read: Harish Shankar: అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్న హరీష్ శంకర్.. కానీ?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook