Flipkart Best Offers: ఫ్లిప్‌కార్ట్‌లో డెడ్ చీప్ ధరలకే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు.. రూ.17 వేలు విలువ చేసే రెడ్‌మీ కేవలం రూ.749కే..

Flipkart Best Offers: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లను డెడ్ చీప్ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2022, 11:29 AM IST
  • ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ ఆఫర్స్
  • స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్
  • కేవలం రూ.749కే రూ.17 వేలు విలువ చేసే రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్
Flipkart Best Offers: ఫ్లిప్‌కార్ట్‌లో డెడ్ చీప్ ధరలకే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు.. రూ.17 వేలు విలువ చేసే రెడ్‌మీ కేవలం రూ.749కే..

Flipkart Best Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. చౌక ధరలో బెస్ట్ బ్రాండ్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ప్లాట్‌ఫామ్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో రెడ్‌మీ ఒకటి. ఈ బ్రాండ్‌కి చెందిన పలు మోడల్స్‌పై భారీ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న అద్భుత ఆఫర్‌తో రూ.17 వేలు విలువ చేసే రెడ్‌మీ 10 (పసిఫిక్ బ్లూ, 128 జీబీ) స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.749కే మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

భారీ డిస్కౌంట్ ఆఫర్ :

రెడ్‌మీ 10 (పసిఫిక్ బ్లూ, 128 జీబీ) స్మార్ట్ ఫోన్‌ సాధారణ ధర రూ.16,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌ 26 శాతం తగ్గింపుతో కేవలం రూ.12,499కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే మరో రూ.250 వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. తద్వారా రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌకగా రూ.12,249కే కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు :

రెడ్‌మీ 10 (పసిఫిక్ బ్లూ, 128 జీబీ) స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని మార్చుకున్నట్లయితే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దాని కండిషన్‌ని బట్టి రూ.11,750 వరకు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.12,499కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ని అతి చౌకగా కేవలం రూ.749కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. 

Also Read: KTR COMMENTS: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయం! ఖమ్మం నేతలకు కేటీఆర్ సంకేతం..

 

 

Also Read: TS TET 2022: నిమిషం లేటైనా నో ఎంట్రీ.. బతిమాలినా కనికరించని పోలీసులు! సెంటర్ల దగ్గర అభ్యర్థుల కన్నీళ్లు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News