Flipkart Electronic sale: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్.. ఛాన్స్ ఇంకా రెండు రోజులే..

Flipkart Electronic sale Offer: యాపిల్ ఐఫోన్ కొనాలని ఉన్నా ధర ఎక్కువని సంకోచిస్తున్నారా.. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్‌లో భారీ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌తో చౌక ధరకే ఐఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 9, 2022, 10:07 AM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్ సేల్ ఆఫర్
  • జూలై 6 నుంచి జూలై 10వ తేదీ వరకు
  • ఐఫోన్ 11, 12, 13పై భారీ తగ్గింపు
Flipkart Electronic sale: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్.. ఛాన్స్ ఇంకా రెండు రోజులే..

Flipkart Electronic sale Offer: ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఎలక్ట్రానిక్ సేల్ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. సాధారణంగా యాపిల్ ఐఫోన్ అంటే ధర ఎక్కువనే కారణంతో చాలామంది కొనేందుకు సంకోచిస్తారు. కానీ ఈ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకున్నట్లయితే చౌక ధరకే యాపిల్ ఐఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్లపై ఉన్న ఆఫర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

ఐఫోన్ 11పై 13 శాతం డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్ :

యాపిల్ ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 11 (64 జీబీ) సాధారణ ధర రూ.49,900. కానీ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్‌లో 13 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.42,999కే ఈ ఐఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. అంటే.. రూ.6901 మేర ఆదా అయినట్లే. ఐఫోన్ 11 (128 జీబీ)పై కూడా 13 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ ద్వారా రూ.54,900 విలువ చేసే ఐఫోన్‌ని చౌకగా రూ.47,999కే కొనుగోలు చేయవచ్చు.

అంతేకాదు, ఈ ఐఫోన్లపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.12,500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్‌చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తించినట్లయితే ఐఫోన్ 11 (64 జీబీ)ని కేవలం రూ.30,499కే మీ సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 (128 జీబీ) కేవలం రూ.37,400కే కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 12పై 15 శాతం డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్:

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12పై 15 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ ద్వారా రూ.65,900 విలువ చేసే ఐఫోన్ 12 (64 జీబీ)ని కేవలం రూ.54,999కే పొందవచ్చు. అంటే.. రూ.10,901 మేర ఆదా అవుతుంది. ఐఫోన్ 12 (128 జీబీ)పై కూడా ఇంతే తగ్గింపు అందుబాటులో ఉంది. తద్వారా రూ.70 వేలు విలువ చేసే ఈ ఫోన్‌ని కేవలం రూ.59,999కే పొందవచ్చు.

ఐఫోన్ 13 మినీపై 7 శాతం డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్:

ఐఫోన్ 13 మినీపై కూడా భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.69,900 విలువ చేసే ఈ ఫోన్‌పై రూ.4901 (7శాతం) మేర తగ్గింపు లభిస్తోంది. అంటే డిస్కౌంట్ పోను రూ.64,999కే ఈ ఐఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్ఠంగా రూ.14,500 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. మీరు ఎక్స్‌చేంజ్ చేసుకునే ఫోన్ కండిషన్‌ని బట్టి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.64,999కి అందుబాటులో ఉన్న ఈ ఐఫోన్‌ని మరింత చౌకగా 54,499కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ లిమిటెడ్ ఆఫర్స్ మాత్రమే. ఎలక్ట్రానిక్ సేల్ అందుబాటులో ఉండే జూలై 6 నుంచి జూలై 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి చౌక ధరకే ఐఫోన్ కొనుగోలు చేయాలంటే మరో రెండు రోజులు మాత్రమే ఛాన్స్ ఉంది.

Also Read: YSRCP Plenary Live Updates:ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు..వైసీపీకి విజయమ్మ రాజీనామా    

Also Read: Hero Vikram Heart Attack: హీరో విక్రమ్ కు తీవ్ర అస్వస్థత.. గుండెపోటుతో హాస్పిటల్ కు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News