Gold Price Today In Hyderabad On 26th January 2021 | జనవరి రెండో వారంలో బులియన్ మార్కెట్లో తగ్గిన బంగారం, వెండి ధరలు తాజాగా స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు, వెండి ధరలు సోమవారం తరహాలోనే మార్కెట్ అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,120 అయింది. 22 క్యారెట్ల బంగారం సైతం నిన్నటి ధరకే పరిమితమైంది. నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.45,940గా మార్కెట్ అవుతోంది.
Also Read: EPF Balance Check: ఈపీఎఫ్ఓ ఖాతాల్లోకి EPF Interest జమ, మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర గత రెండు రోజులుగా క్షీణిస్తున్నాయి. అయితే తాజాగా బంగారం ధర(Gold Price Today On 26th January)లలో ఏ మార్పులేదు. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,470 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100గా విక్రయాలు జరుగుతున్నాయి.
Also Read: RBI Big Decision: పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర ఇటీవల రూ.700 మేర పతనమైంది. కానీ తాజాగా బులియన్ మార్కెట్లో వెండి ధరలలో ఏ మార్పు లేదు. నేడు 1 కేజీ వెండి ధర రూ.66,700 వద్ద స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలో సైతం ఏ మార్పు లేదు. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర నిన్న పతనం కాగా, నేడు సైతం అదే ధర రూ.71,300గా మార్కెట్ అవుతోంది.
Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు సాయం రూ.10,000కు పెంపు.. బడ్జెట్లో ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook