Best Bikes in India: భారీగా అమ్ముడవుతున్న బైక్‌లు ఇవే.. పరుగులు పెడుతున్న జనాలు

Auto News in Telugu: ఈ మధ్య కాలంలో హీరో మోటోకార్ప్, టీవీఎస్ బైక్స్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది జనవరిలో ఈ రెండు సంస్థల విక్రయాలు 20 శాతానికి పైగా పెరిగాయి. ఈ బైక్స్ కొనేందుకు ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2024, 03:38 PM IST
Best Bikes in India: భారీగా అమ్ముడవుతున్న బైక్‌లు ఇవే.. పరుగులు పెడుతున్న జనాలు

Hero and TVS Sales Increased In January 2024: ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థల్లో హీరో మోటోకార్ప్ ఒకటి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కంపెనీ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ఈ సంస్థ అమ్మకాలు 22 శాతం పెరిగాయి. హీరో మోటోకార్ప్ వాహన విక్రయాలు జనవరి 2024లో 4,33,598 యూనిట్లకు పెరిగాయి. గత ఏడాది జనవరిలో (2023) కంపెనీ విక్రయాలు 3,56,690 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ విపణిలో హీరో మోటోకార్ప్ విక్రయాలు 20 శాతం పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దేశీయంగా ఈ సంవత్సరం జనవరిలో 4,20,934 యూనిట్లు అమ్ముడుపోగా.. గత ఏడాది జనవరి నెలలో 3,49,437 యూనిట్లు విక్రయించబడినట్లు తెలిపింది. 

టీవీఎస్ జోరు..

జనవరి నెలలో హీరో మోటోకార్ప్‌ సేల్స్ తోపాటు టీవీఎస్ మోటార్ సంస్థ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. ఈ కంపెనీ అమ్మకాలు జనవరిలో 23 శాతం పెరిగాయి. TVS జనవరి 2024లో 339,513 యూనిట్లను విక్రయించగా.. గత ఏడాది (2023) ఇదే నెలలో మొత్తం 2,75,115 యూనిట్లు విక్రయించబడ్డాయి. ద్విచక్ర వాహనాల విక్రయాల్లో 25 శాతం వృద్ధి నమోదైనట్లు టీవీఎస్ మోటార్ ఓ ప్రకటనలో తెలిపింది. 2023 జనవరిలో 2,64,710 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు.. 2024 జనవరిలో 329,937 యూనిట్లకు పెరిగింది. అదే సమయంలో దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు 24 శాతం వృద్ధితో 2,68,233 యూనిట్లుగా ఉన్నాయి.

Also Read: UPI Cashback Offer: ఈ బ్యాంకుతో యూపీఐ లావాదేవీలు జరిపితే 7500 రూపాయలు క్యాష్‌బ్యాక్

ద్విచక్ర వాహనాల విభాగంలో మోటార్‌సైకిల్ విక్రయాలు గత నెలలో 29 శాతం పెరిగి 1,55,611 యూనిట్లకు చేరుకున్నాయి, ఇది జనవరి 2023లో 1,21,042 యూనిట్లు. స్కూటర్ సెగ్మెంట్లో అమ్మకాలు ఈ సంవత్సరం జనవరిలో 24 శాతం పెరిగి 1,32,290 యూనిట్లకు చేరుకోగా... గతేడాది ఇదే నెలలో 1,06,537 యూనిట్లుగా ఉన్నాయి. జనవరిలో తమ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 34 శాతంతో 16,276 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ మొత్తం ఎగుమతులు 22 శాతం పెరిగాయి.

Also Read: PF Balance Check: ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News