Honda Activa Electric: 180 కిమీ మైలేజీతో ఎలక్ట్రిక్‌ హోండా యాక్టివా వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్!

Honda Activa Electric: త్వరలోనే మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ హోండా యాక్టివా విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా విడుదలకు ముందే ఇటీవలే ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 20, 2024, 04:53 PM IST
Honda Activa Electric: 180 కిమీ మైలేజీతో ఎలక్ట్రిక్‌ హోండా యాక్టివా వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్!

Honda Activa Electric Scooter: మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ మోటర్‌ సైకిల్స్‌కి ప్రత్యేక డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌, బైక్స్‌కి ప్రత్యేమైన గుర్చింపు ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా మోటర్‌ సైకిల్‌ కంపెనీలు తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్‌ స్కూటిలను లాంచ్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే హోండా కంపెనీ కూడా ముందడు వేసింది. ఎంతో ప్రజాదరణ పొందిన యాక్టివా మోడల్‌ను హోండా కంపెనీ ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లో విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ అతి త్వరలోనే లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌కి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. 

హోండా కంపెనీ ఈ యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే సంవత్సరం మార్కెట్‌లోకి లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ప్రపంచ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా ఈ యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటీ పేరు మార్చుతూ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్, టీవీఎస్ జూపిటర్ వంటి  అనేక స్కూటర్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

భారత మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడు పోతున్న స్కూటీల్లో టాప్‌ వన్‌ హోండా యాక్టివా ఉంది. త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్ కాబోయే ఎలక్ట్రిక్‌ హోండా యాక్టివా గుజరాత్, కర్ణాటక ప్లాంట్లలో తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జపాన్ మొబిలిటీ షోలో SC E కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ రివీల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ ఎంతో ఆకర్శనీయంగా కనిపించింది. అంతేకాకుండా ఎల్‌ఈడీ లైట్లతో అందుబాటులోకి రావడం వల్ల మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందింది. అయితే హోండా కంపెనీ కూడా యాక్టివాను కూడా ఇదే తరహాలో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ హోండా యాక్టివా ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది ఫ్రాంట్‌ భాగంలో ప్రత్యేమై DRL LED లైట్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా హ్యాండిల్ ముందు LED లైట్ సెటప్‌ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు 7-అంగుళాల స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది. అలాగే హోండా ఈ స్కూటర్‌లో స్క్రీన్ ట్రిప్ మీటర్ సెటప్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. మీటర్‌లో ఓడోమీటర్, రేంజ్, మోడ్, సమయం, తేదీ, వాతావరణం, బ్యాటరీ పరిధి, బ్యాటరీ ఛార్జింగ్  వంటి ఇండికేషన్స్‌ కూడా కలిగి ఉంటాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ 10 ఫీచర్లు:
ఒకే ఛార్జీతో 180 కిమీ వరకు ప్రయాణించగల సామర్థ్యం
120 కిమీ/గం గంటకు గరిష్ట వేగం
LED లైటింగ్
డ్యూయల్ బ్యాటరీలు
డిజిటల్ స్పీడోమీటర్
ముందు డిస్క్ బ్రేక్ 
టెలిస్కోపిక్ సస్పెన్షన్
26 లీటర్ల స్టోరేజ్ స్పేస్
USB చార్జింగ్ పోర్ట్ 
రివర్స్ గేర్
సైడ్ స్టాండ్ సెన్సార్
కీలెస్ ఎంట్రీ
సెక్యూరిటీ సిస్టమ్
అలాయ్ వీల్స్

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News