Rail Vikas Nigam Ltd (RVNL) : స్టాక్ మార్కెట్లో మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ ను వెతికి పెట్టడం అంటే కత్తి మీద సామే అని చెప్పాలి. ఒక్కోసారి మన కళ్ళముందే కొన్ని స్టాక్స్ వేల రెట్లు పెరిగిపోతూ ఉంటాయి. అయ్యో ఈ స్టాక్ లో నేను ఇన్వెస్ట్ చేయలేకపోయానే అని మీరు నాలుక కరుచుకుంటూ ఉంటారు. మీరు అండర్ ఎస్టిమేట్ చేసినటువంటి స్టాక్స్ ఒక్కోసారి ఓవర్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. అలాంటి ఓ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టాక్ విషయానికి వస్తే భారత ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే వికాస్ నిగం లిమిటెడ్ (RVNL) కు సంబంధించింది.
రైల్వే శాఖకు చెందిన ఈ స్టాక్ ఆకాశమే హద్దుగా పెరిగింది అంటే ఆశ్చర్యం కాక తప్పదు. ఎందుకంటే ఈ స్టాక్ సరిగ్గా ఆగస్టు 16, 2019వ సంవత్సరం రోజు 24 రూపాయలు మాత్రమే ఉంది. అక్కడి నుంచి చూస్తే 2024 ఆగస్టు 13వ తేదీ నాటికి ఈ స్టాక్ ధర 568 రూపాయల వరకు పెరిగింది. గత నెలలో ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి 647 రూపాయలకు ట్రేడ్ అయింది. గడచిన ఐదు సంవత్సరాలు ఈ స్టాక్ ఏకంగా 2200% లాభం అందించింది అంటే షాక్ కు గురికాక మానదు.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన Rail Vikas Nigam Ltd (RVNL) రైల్ వికాస్ నిగం లిమిటెడ్ లో కేంద్ర ప్రభుత్వానికి 78 శాతం వాటా ఉంది. ఈ సంస్థ భారత రైల్వే శాఖకు అనుబంధ సంస్థగా పని చేస్తోంది. 2019లో లిస్ట్ అయినప్పుడు కేవలం 19 రూపాయలు మాత్రమే ఉంది. 2023 వరకు ఈ స్టాక్ 100 రూపాయలు టచ్ చేయలేదు. కానీ అనూహ్యంగా 2023 జూన్ నెల నుంచి ఈ స్టాక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. ఏడాది కాలంలోనే 354% లాభాన్ని అందించింది.
Also Read : Gold Price Today: పసిడి పరుగు..మళ్లీ పెరుగుతున్న బంగారం..తులం ఎంత ఉందంటే?
ఈ స్టాక్ లో 2019 సంవత్సరంలో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే నేడు అవి అక్షరాల రూ. 25 లక్షలు అయి ఉండేవి. అవును మీరు విన్నది నిజమే. ఎందుకంటే 2019 వ సంవత్సరంలో ఈ స్టాక్ ధర సుమారు 25 రూపాయలు వరకు ఉంది. ఈ లెక్కన మీరు లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే దాదాపు 4000 షేర్లు కొనాల్సి ఉంటుంది. 2024 జూలై 13 వ తేదీ నాటికి ఈ స్టాక్ ధర 52 వారాల గరిష్ట స్థాయి అయినా 647 రూపాయలు తాకింది. ఈ స్థాయి నుంచి మీరు పెట్టుబడిన పెట్టిన 1 లక్ష రూపాయలు అక్షరాల రూ. 25 లక్షల పైనే అయినట్టు గమనించవచ్చు ఈ రేంజ్ లో మీరు ఒక లక్ష రూపాయలను సుమారు పాతిక రెట్లు పెరగాలంటే ఏ వ్యాపారం చేసినా కానీ దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు.
ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి రైల్వే వికాస్ నిగం లిమిటెడ్ 2002వ సంవత్సరంలో స్థాపించగా ప్రస్తుతం ఈ సంస్థ ఆస్తుల విలువ 19 వేల కోట్లుగా ఉంది. ఈ సంస్థకు 5600 కోట్ల ఈక్విటీ నిధులు ఉన్నాయి. అలాగే 515 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. 2021- 22 లో మొత్తం 18 రైల్వే ప్రాజెక్టులను ఈ సంస్థ పూర్తి చేసింది. రైల్వే విద్యుద్దీకరణ, రైల్వే లైన్ల ఏర్పాటు వంటివి ఈ సంస్థ చేసే ప్రధాన కార్యకలాపాల్లో భాగంగా చెప్పవచ్చు. అలాగే ఈ సంస్థ మెట్రో రైల్ ప్రాజెక్టులను కూడా నిర్వహిస్తోంది.
Also Read : CIBIL Score : ఇకపై సిబిల్ స్కోర్ బాధలు తీరడం ఖాయం..ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook