GDP: తొలి క్వార్టర్ లో దేశ జీడీపీ 15 నెలల కనిష్ఠ స్థాయి 6.7 శాతం వద్ద నమోదు.. వ్యవసాయం, సేవా రంగంలో డీలా

India's GDP growth: దేశ జీడీపీ తొలి క్వార్టర్ లో 15 నెలల కనిష్ఠ స్థాయి 6.7 శాతం వద్ద నమోదు చేసింది. గత త్రైమాసికంలో కీలక రంగాలైన వ్యవసాయం, సేవా రంగంలో వృద్ధి డీలా పడటంతో ఆ ప్రభావం వృద్ధి రేటుపై పడింది. దీనికి తోడు పరోక్ష పన్నుల వసూళ్లలో  తక్కువ వృద్ధి కనబరిచింది. ఫలితంగా జీడీపీ 5 క్వార్టర్ల కన్నా తక్కువ నమోదు అయ్యింది.

Written by - Bhoomi | Last Updated : Aug 31, 2024, 03:18 PM IST
GDP: తొలి క్వార్టర్ లో దేశ జీడీపీ 15 నెలల కనిష్ఠ స్థాయి 6.7 శాతం వద్ద నమోదు.. వ్యవసాయం, సేవా రంగంలో డీలా

India Q1 FY25 GDP Data Highlights: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, దేశ ఆర్థిక వృద్ధి రేటు గత 5 త్రైమాసికాల కన్నా కూడా  కనిష్ట స్థాయి 6.7 శాతానికి తగ్గింది. జీఎస్టీ వంటి పరోక్ష పన్నుల వసూళ్లలో  తక్కువ వృద్ధి మూలంగా స్థూల జాతీయోత్పత్తి  (GDP) వృద్ధి రేటుపై ప్రభావం చూపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో GDP వృద్ధి రేటు 7.1 శాతంగా అంచనా వేయగా, అంతకన్నా తక్కువ స్థాయి వద్ద జీడీపీ నమోదు అయ్యింది. 

2024-25 తొలి త్రైమాసికంలో వాస్తవ  జీడీపీ రూ.43.64 లక్షల కోట్లుగా నమోదైనట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఈరోజు విడుదల చేసిన డేటా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)6.7 శాతం నమోదు చేసింది. కాగా 2023-24 ఏప్రిల్‌-జూన్‌లో వృద్ధి రేటు 8.2% ఉండటం గమనార్హం.  

సాధారణంగా, సబ్సిడీలకు అదనంగా పరోక్ష పన్నులు తోడవడంతో GVA వృద్ధి కంటే వాస్తవ GDP వృద్ధి ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అంశం మొదటి త్రైమాసికంలో 3.6 శాతం తక్కువ వృద్ధిని సాధించింది. 2025 మొదటి నాలుగు నెలల్లో 10.9 శాతం ప్రతికూల వృద్ధిని సాధించింది.అంటే భవిష్యత్తులో కూడా GVA, GDP వృద్ధి రేటు దాదాపు ఒకే విధంగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ICRA చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ మాట్లాడుతూ ...GDP వృద్ధి మందగించడం ఆందోళన కలిగించే విషయం కాదని, ఇది నికర పరోక్ష పన్నుల వసూళ్లలో తక్కువ వృద్ధి కారణంగా జరిగిందని అన్నారు. గత రెండు త్రైమాసికాలలో,GDP, GVA మధ్య సగటున 160 బేసిస్ పాయింట్ల వ్యత్యాసం ఉంది, 

2025 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2.7 శాతం. రుతుపవనాలు  వేడిగాలులు వ్యవసాయ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపినట్లు రిపోర్టు పేర్కొంది. కానీ నిర్మాణ రంగంలో రెండంకెల వృద్ధి 10.5 శాతం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా  10.4 శాతం ద్వారా వ్యవసాయ రంగంలో కొరత భర్తీ చేయబడింది. కానీ తయారీ రంగం జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే మందగించింది.  ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7 శాతంగా ఉంది. సేవల రంగం 7.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Also read: IMD Heavy Rains Alert: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, ఏపీ అంతా అతి భారీ వర్షాలు , తస్మాత్ జాగ్రత్త

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 6.5-7 శాతం మధ్యలో నమోదయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే దేశంలోని పలు ప్రాంతాల్లో తొలి త్రైమాసికంలో సరిగ్గా నమోదు కాలేదని, దీనికి తోడు ఈ సారి వేసవిలో వడగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతిన్నది. అయితే ప్రస్తుతం వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో వ్యవసాయం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే గత త్రైమాసికంలో ఎన్నికలు జరగడం కూడా తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి తగ్గేందుకు కారణమైందని నిపుణులు పేర్కొంటున్నారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News