iPhone 12 Mini Flipkart: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.20 వేలకే iPhone 12 Mini!

iPhone 12 Mini Flipkart: ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం సమ్మర్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో భాగంగా Apple iPhone 12 Mini 64 GB స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 60 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 20 వేలకే కొనుగోలు చేయవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 12:43 PM IST
iPhone 12 Mini Flipkart: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.20 వేలకే iPhone 12 Mini!

iPhone 12 Mini Flipkart: యాపిల్ ఐఫోన్ మోడల్స్ పై ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ కంపెనీ ప్రతి ఏడాది విడుదల చేసే మోడల్స్ గురించి గాడ్జెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే వీటికి ఉన్న క్రేజ్ కు తోడు మరిన్ని డిస్కౌంట్స్, ఆఫర్స్ అందుబాటులో ఉంటే.. ఇంక వాటిని కొనేందుకు పోటీ పడతారు. అయితే ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో కొనసాగుతున్న ప్రత్యేక సేల్ లో iPhone 12 Mini 64 GB స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 60 వేలు విలువైన ఈ ఐఫోన్ ను కేవలం రూ. 20 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Apple iPhone 12 Mini ఆఫర్‌లు, తగ్గింపులు..

Apple iPhone 12 Mini 64 GB మోడల్ విడుదల ధర రూ. 59,900 గా ఉంది. అయితే  దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో 16 శాతం డిస్కౌంట్ తో అంటే దాదాపుగా రూ. 9,901 వరకు తగ్గింపుతో రూ. 49,999 ధరకే విక్రయిస్తున్నారు. అయితే ఈ ఐఫోన్ కొనుగోలు సమయంలో అనేక బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఈ మొబైల్ కొనుగోలు సమయంలో RBL బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ పై 5% క్యాష్‌బ్యాక్ కూడా పొందేందుకు అవకాశం ఉంది. 

వీటితో పాటు ఐఫోన్ 12 మినీ డీల్ లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా అత్యధికంగా రూ. 30 వేలు పొందేందుకు అవకాశం ఉంది. అయితే అది మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ బట్టి ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్స్, డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని.. Apple iPhone 12 Mini స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 20 వేలకే కొనుగోలు చేయవచ్చు. 

Also Read: New Rules in June: పౌరులారా తస్మాత్ జాగ్రత్త.. జూన్ లో అమలు కానున్న కొత్త రూల్స్!

Also Read: Boat 175 Airdopes Launch: వాటర్ ప్రూఫ్ ఇయర్ బడ్స్.. 35 గంటలు నాన్ స్టాప్ వర్కింగ్ తో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News