Hero Diwali Discount: హీరో దీపావళి ఆఫర్స్‌ ప్రారంభం.. కొన్ని బైక్‌లపై ఏకంగా రూ.12,000 క్యాష్‌బ్యాక్‌!

Hero Diwali Huge Discount: అత్యంత తగ్గింపు ధరతో దీపావళి సందర్భంగా హీరో కొన్ని మోటర్‌ సైకిల్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి అత్యంత చౌకగా బైక్స్‌ పొందవచ్చు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 7, 2024, 01:31 PM IST
Hero Diwali Discount: హీరో దీపావళి ఆఫర్స్‌ ప్రారంభం.. కొన్ని బైక్‌లపై ఏకంగా రూ.12,000 క్యాష్‌బ్యాక్‌!

 

Hero Diwali Huge Discount: దీపావళికే ముందే ప్రముఖ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) బైక్స్‌, స్కూటర్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను ప్రకటించింది. దీపావళీకి ముందే మంచి మోటర్‌ సైకిల్‌ని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. హీరో కొన్ని మోడల్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. అలాగే వాటిపై ప్రత్యేకమైన కూపన్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. పండగ సందర్భంగా సాధరణ కస్టమర్స్‌కి అతి తక్కువ ధరలోనే స్కూటర్స్‌ను అందించాలనే ఉద్యేశంతో ప్రత్యేకమైన ఆఫర్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ పండగ సమయాల్లో అతి తక్కువ ధరలకే లభించే మోటర్‌ సైకిల్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

హీరో స్ప్లెండర్ ప్లస్:
అత్యధిక తగ్గింపుతో లభించే బైకుల్లో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. దీనిని కంపెనీ గతంలో అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల చేసింది. అయితే ఈ మోటర్‌ సైకిల్‌ను ప్రత్యేకమైన దీపావళి ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా EMI ఆప్షన్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.5 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ కూడా లభిస్తుంది. అలాగే హీరో గోల్డ్ లైఫ్ బెనిఫిట్‌ ఆఫర్‌ కూడా లబిస్తుంది. దీని ద్వారా ఏకంగా రూ.5000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా ఈ బైక్‌ను హీరో కంపెనీ అత్యంత తక్కువ డౌన్‌ పేమెంట్‌ ( రూ.1,999) కట్టి పొందే అవకాశాన్ని కూడా అందిస్తోంది. అలాగే అన్ని బ్యాంక్‌లపై దాదాపు 5.99 శాతం వడ్డీ రేటుతో EMI ఆప్షన్‌ ద్వారా కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా హారో కల్పిస్తోంది. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.      

హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్:
దీపావళికి ముందు మంచి స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఛాన్స్‌.. హీరో అందిస్తున్న దీవాళి ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్  మోటర్‌ సైకిల్‌ అద్భుతమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిని కూడా EMI ఆప్షన్‌తో కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. ఇవే కాకుండా దీనిని కూడా తగ్గింపు బ్యాంక్‌ ఇంట్రెస్ట్‌ రేటుతో కేవలం రూ.1999 కట్టి, కొత్త ఈ బైక్‌ను సొంతం చేసుకొవచ్చు. అలాగే ఈ మోటర్‌ సైకిల్‌పై ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

హీరో డెస్టిని 125 XTEC:
ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా హీరో డెస్టిని 125 XTEC మోటర్‌ సైకిల్‌ కూడా అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన EMI ఆప్షన్‌ కూడా అందిస్తోంది. అలాగే ఈ మోటర్‌ సైకిల్‌ను ఇప్పుడే కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.5000 క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. దీంతో పాటు ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా రూ.12,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ బైక్‌ను తక్కువ డౌన్‌ పే మెంట్‌ కట్టి పొందే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఇవే కాకుండా దీనిపై హీరో నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. 

ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News