Tips: మీ ఐఫోన్‌ బ్యాటరీ త్వరగా అయిపోతోందా..? అయితే మీరు ఈ పని చేయండి..!

ఐఫోన్‌, ఐపాడ్‌లలో బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటంలేదని చాలా మంది వినియోదారులు యాపిల్‌ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో యాపిల్ కంపెనీ దిగొచ్చి, బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండేందుకు చర్యలు ప్రారంభించింది యాపిల్.బ్యాటరీ  సమస్యకు పరిష్కారంగా IOS- 15.4.1 వెర్షన్‌ను యాపిల్‌ విడుదల చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 12:04 PM IST
  • IOS-15తో యూజర్లకు ఓ మంచి ఫీచర్లను పరిచయం చేసిన యాపిల్‌ కంపెనీ
  • ఐఫోన్‌, ఐపాడ్‌లలో బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటంలేదని ఫిర్యాదు
  • IOS- 15.4.1 వెర్షన్‌లో బ్యాటరీ సమస్యకు చెక్‌ పెట్టిన యాపిల్
Tips: మీ ఐఫోన్‌ బ్యాటరీ త్వరగా అయిపోతోందా..? అయితే మీరు ఈ పని చేయండి..!

Good News for  Iphone Uers: 2021 సెప్టెంబరులో యాపిల్‌ కంపెనీ విడుదల చేసిన IOS-15తో యూజర్లకు ఓ మంచి ఫీచర్లను పరిచయం చేసింది. ఆ తర్వాత 2022 మార్చి నెలలో  IOS-15కు అప్‌డేట్‌గా IOS-15.4 వెర్షన్‌ను తీసుకొచ్చింది యాపిల్‌ కంపెనీ. ముఖ్యంగా యాపిల్‌ నోట్స్‌ యాప్‌లో స్కాన్‌ టెక్ట్స్‌, ట్యాప్‌ టు పే, కొత్త ఎమోజీలు, యూనివర్సల్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లతోపాటు ఫేస్‌ మాస్క్‌ ధరించినా మొబయిల్‌ అన్‌లాక్‌ అయ్యేలా ఫేస్‌ఐడీ అండ్‌ పాస్‌కోడ్ సెక్షన్‌లో సరికొత్త  ఫీచర్‌ను పరిచయం చేసింది యాపిల్‌ కంపెనీ.ఇలా పోయిన సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరంలో కూడా యాపిల్‌ కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసింది. 

అయితే IOS-15.4 వెర్షన్‌ను అప్‌డేట్ చేసినప్పటి నుంచి ఐఫోన్‌, ఐపాడ్‌లలో బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటంలేదని ఎక్కువ మంది వినియోదారులు యాపిల్‌ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో యాపిల్ కంపెనీ దిగొచ్చి, బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండేందుకు చర్యలు ప్రారంభించింది యాపిల్.బ్యాటరీ  సమస్యకు పరిష్కారంగా IOS- 15.4.1 వెర్షన్‌ను యాపిల్‌ విడుదల చేసింది. మార్చిలో విడుదల చేసిన IOS-15.4 వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకున్న వినియోగదారులు తప్పనిసరిగా ఐఓఎస్‌ 15.4.1 వెర్షన్‌ను కూడా అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఈ IOS- 15.4.1 వెర్షన్‌లో బ్యాటరీ సమస్యకు చెక్‌ పెట్టడంతో పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను విడుదల చేసినట్లు యాపిల్ సంస్థ తెలిపింది. 

అప్‌డేట్ కోసం ఇలా చేయండి...
ముందుగా ఐఫోన్ సెట్టింట్స్‌లోకి వెళ్లి జనరల్ సెక్షన్‌ ఓపెన్ చేయాలి. అప్పుడు అందులో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై ఓ టచ్‌ ‌ చేస్తే ఓఎస్‌ అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోమని తెలుపుతుంది. ఆ తర్వాత డౌన్‌లోడ్‌పై టచ్‌ చేసి పాస్‌కోడ్ ఎంటర్‌ చేసి, IOS- 15.4.1 అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేస్తే చాలు మీ ఐఫోన్, ఐపాడ్ బ్యాటరీ సమస్యకు చెక్ పెట్టినట్లే. 

Also Read: Janhvi Kapoor Photos: షైనింగ్ డ్రస్సులో వజ్రంలా మెరిసిపోతున్న నటి జాన్వీ కపూర్!

Also Read: Sai Pallavi Farming: కూలీగా మారిన 'శ్యామ్ సింగరాయ్' మూవీ హీరోయిన్ - ఫొటోలు వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News