Jio Plus Unlimited: జియో బంపర్ ఆఫర్.. రూ.19 కే అన్‌లిమిటెడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్

Jio Plus Unlimited: నేషనల్ వైడ్ నెట్‌వర్క్‌తో అంతరాయం లేకుండా హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ అందించి ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా 5G రాకతో మరోసారి తన మార్కెట్ ప్రజెన్స్ పెంచుకోవడానికి గట్టి ఎత్తుగడలు వేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 09:09 PM IST
Jio Plus Unlimited: జియో బంపర్ ఆఫర్.. రూ.19 కే అన్‌లిమిటెడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్

Jio Plus True 5G Unlimited Data: నేషనల్ వైడ్ నెట్‌వర్క్‌తో అంతరాయం లేకుండా హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ అందించి ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా 5G రాకతో మరోసారి తన మార్కెట్ ప్రజెన్స్ పెంచుకోవడానికి గట్టి ఎత్తుగడలు వేస్తోంది. ఎప్పటికప్పుడు కాంపిటీటర్స్‌కి గట్టి పోటీనిచ్చేలా రీచార్జ్ ప్లాన్స్, ఆఫర్స్ ప్రకటిస్తూ కొత్త కస్టమర్స్‌ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే తాజాగా జియో మరో సెన్సేషనల్ ఆఫర్ ప్రకటించింది. 

అన్‌లిమిటెడ్ 4G డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటా అందివ్వడంతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా అందిస్తోంది. నెలకు రూ. 599 టారిఫ్ ద్వారా ఈ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తున్నట్టు రిలయన్స్ జియో స్పష్టంచేసింది. అంటే రోజుకు కేవలం రూ. 19 మాత్రమే అన్నమాట. అన్‌లిమిటెడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ మాత్రమే కాకుండా నిత్యం 100 వరకు ఉచిత SMS లు కూడా లభిస్తాయి. 

అలాగే వన్ ప్లాన్ మెనీ బెనిఫిట్స్ అని రిలయన్స్ జియో ప్రకటించిన విధంగానే ఈ రూ.599 టారిఫ్ ప్లాన్ తీసుకున్న వారికి  JioTV, Jio Cinema, Jio Cloud తో సహా జియోకు సంబంధించిన మరెన్నో ఇతర ఇన్పోటెయిన్మెంట్ యాప్స్‌కి ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. కస్టమర్ సౌలభ్యం కోసం వారి మొబైల్ 5G సపోర్ట్ చేస్తే 5G డేటా ఉపయోగించుకునేలా.. లేదంటే 4G డేటా ఉపయోగించుకునేలా రిలయన్స్ జియో ఈ టారిఫ్ ని రూపొందించింది. 

నెల నెల రీచార్జుల బెడద లేకుండా.. ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కు మారాలనుకొనే వారికి రిలయన్స్ జియో అందిస్తున్న ఈ వెల్ కమ్ ఆఫర్ సరిగ్గా సూట్ అవుతుంది. అలాగే ఎలాంటి పరిమితులు లేకుండా హై స్పీడ్ డేటా కోరుకునే వారికి, నాన్-స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ కోరుకునే వారి అవసరాలకు అనుగుణంగా ఈ టారిఫ్ ఉంటుంది. ఈ టారిఫ్‌తో లభించే మరో అవకాశం ఏంటంటే.. 30 రోజుల ఉచిత ట్రయల్‌ని కూడా పొందవచ్చు.

Trending News