Allu Arjun Political Entry: రాజకీయాల్లోకి అల్లు అర్జున్..? PK తో పుష్ప రాజ్ భేటీ..

Allu Arjun Political Entry: పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ ఆకాశమంతా పెరిగింది. అంతేకాదు బాలీవుడ్ లో ఖాన్స్, కపూర్స్ కు కూడా సాధ్యం కానీ రికార్డులను అలవోకగా క్రాస్ చేసాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అడుగులు రాజకీయాల వైపు పడుతున్నాయా అంటే ఔననే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 12, 2024, 07:11 AM IST
Allu Arjun Political Entry: రాజకీయాల్లోకి అల్లు అర్జున్..? PK తో పుష్ప రాజ్ భేటీ..

Allu Arjun Political Entry: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ను  కలిశారా? ఆయన ఇచ్చిన సూచనతో త్వరలోనే సోషల్ సర్వీస్ ప్రారంభించబోతున్నారా.. అంటే ఔననే అంటున్నారు అల్లు వారి సన్నిహితుల వర్గాలు. అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ప్యాన్ ఇండియా లెవల్లో ఎక్కడా తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తున్నాడు. పుష్ప సిరీస్  సినిమాలతో జాతీయస్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.

తెలుగులో ఈ స్థాయిని అందుకున్న అతికొద్ది యువ కథానాయకుల్లో ఆయన ఒకరు. ఆయనకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. ఆయన పిలుపు అందుకుని ఆచరణలో పెట్టే అల్లు ఆర్మీనే ఉంది. భారీ ఇమేజ్ తో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలుగు రాజకీయాల్లో సక్సెస్ అందుకున్నారు. ఇదే బాటలోనే అల్లు అర్జున్ కూడా వెళ్లాలనుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ను కలిసినట్టు సమాచారం.

ఐతే.. ఇప్పుడే వద్దని.. కనీసం పదేళ్లు సోషల్ సర్వీస్ లో కొనసాగి ఆ తర్వాతే రాజకీయ ప్రకటన చేయాలని అల్లు అర్జున్ కు పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ సూచించినట్టు సమాచారం. పీకేతో భేటీలో అల్లు అర్జున్, బన్నీ వాసు, ఓ బడా పారిశ్రామికవేత్త కుమారుడు పాల్గొన్నట్టు సమాచారం. ప్రశాంత్ కిశోర్ సూచనతో మామ చిరంజీవి స్టైల్ లో అతి త్వరలోనే అల్లు అర్జున్ బ్లడ్ బ్యాంక్ లాంటి సామాజిక కార్యక్రమాలతో జనాల ముందుకు రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రజలకు దగ్గరయ్యేలా తరచుగా పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని అల్లు అర్జున్ నిర్ణయించినట్టు సమాచారం.

ఇక అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో పలకరించారు. అంతేకాదు ఈ సినిమా అతి తక్కువ సమయంలో 6 రోజుల్లోనే రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించి సంచలనం రేపుతోంది. అంతేకాదు బాలీవుడ్ లో  కూడా పూటకో రికార్డు స్మాష్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రాజకీయాల్లో రావాలనే ఉద్దేశ్యంతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకేతో భేటీ అయినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News