Pm Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? ఇప్పుడే ఇలా అప్లై చేసుకోండి..

Kisan Credit Card Apply: కిసాన్ కార్డును అప్లై చేయాలనుకునేవారు ముందుగా వెబ్సైట్లో ఉండే దరఖాస్తు ఫారాలను నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీ దగ్గరలో ఉన్న బ్యాంకి వెళ్లి అక్కడి సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2022, 01:36 PM IST
Pm Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? ఇప్పుడే ఇలా అప్లై చేసుకోండి..

Kisan Credit Card Apply: కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే ఓ చక్కటి సదుపాయం. ఈ పథకం సహాయంతో రైతులు తక్కువ వడ్డీ రేటుకు రుణం తీసుకుని వారి పంట పొలాలకు అవసరమైన ఎరువులను కొనుగోలు చేస్తారు. వ్యవసాయంలో వచ్చే ఖర్చులే కాకుండా.. పంట తీసిన తర్వాత మార్కెట్కు చేర్చేందుకు కావాల్సిన సదుపాయాల కోసం కూడా ఈ రుణాన్ని తీసుకోవచ్చు. ఈ పథకం ద్వారా రైతులు అత్యంత ఆర్థిక పరిస్థితుల్లో నుంచి తేలికగా బయటికి రాగలుగుతారు. అయితే ఈ కార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు బ్యాంకుల ద్వారా జారీ చేస్తుంది. 

మీరు కూడా కిసాన్ క్రెడిట్ కార్డును పొందాలనుకుంటే.. మీ దగ్గర ఉండే బ్యాంకులో క్రెడిట్ కార్డు కేవైసీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ క్రెడిట్ కార్డును పొందేందుకు KCC ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో.. ఈ ప్రక్రియకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో..? ఇతర అన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం అర్హత:
రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తు కోసం చేసుకునేవారు తప్పకుండా పొలం పత్రాల డాక్యుమెంట్స్ ను జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సొంత పొలాలు ఉన్నవారే కాకుండా..కౌలు రైతులు, మౌఖిక కౌలుదారులు, వాటాదారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా అప్లై చేయడానికి కావాల్సిన పత్రాలు:
రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు, ఐడి ప్రూఫ్ (డ్రైవింగ్ లైసెన్స్ / ఆధార్ కార్డ్ / ఓటర్ ఐడి కార్డ్ / పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్) మొదలైన రెసిడెన్షియల్ ప్రూఫ్ కోసం బ్యాంక్ నుంచి దరఖాస్తు ఫారమ్, రెవెన్యూ అథారిటీ ద్వారా ధృవీకరించబడిన భూమి హోల్డింగ్ సర్టిఫికేట్.. సమాచారం మూడు లక్షల కంటే ఎక్కువ రుణాలకు విత్తిన పంట, సెక్యూరిటీ డాక్యుమెంట్లు మొదలైనవి అవసరం. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
కిషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు..SBI యొక్క వెబ్‌సైట్ ప్రకారం ప్రాసెసింగ్ ఇంచార్జ్లను చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు ఈ కార్డు పై రైతులకు దానికి స్థిర వడ్డీ రేటును రుణంగా ఇస్తుంది. రూ.50,000 వరకు KCC రుణాలకు ప్రాసెసింగ్ ఛార్జీ లేదు. మరిన్ని వివరాల కోసం ఆన్లైన్లోనే వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.

Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ సినిమాకు టైటిల్ మార్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'గా వస్తున్న పవర్ స్టార్  

Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News